రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా పెద్ద సవాలు. ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం వల్ల షుగర్ లెవల్స్ పెరగడమే కాకుండా తీవ్రమైన శరీర అలసట, నీరసం, రాత్రివేళల్లో అరికాళ్లలో తీవ్రమైన మంటలు వస్తుంటాయి…ఈ సమస్యలన్నింటికీ సిద్ధ వైద్య నిపుణురాలు డాక్టర్ నిత్య ఒక సులభమైన, అద్భుతమైన ఆహార చిట్కాను అందించారు. ఉదయాన్నే టిఫిన్గా మొలకెత్తిన రాగులు, మెంతుల మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తయారీ విధానం:
నానబెట్టడం: 100 గ్రాముల రాగులను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో తీసుకోండి. దానికి 1 స్పూన్ మెంతులు కలిపి మునిగేంత వరకు నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టాలి. మరుసటి రోజు నీటిని వడకట్టి, ఆ రాగులు-మెంతుల మిశ్రమాన్ని ఒక శుభ్రమైన తెల్లటి కాటన్ గుడ్డలో మూటకట్టి 24 నుండి 32 గంటల పాటు ఉంచాలి. దీనివల్ల ధాన్యాలు బాగా మొలకెత్తుతాయి. చాలామంది మొలకెత్తిన విత్తనాలను పచ్చిగానే తింటారు. కానీ, వాటిపై క్రిములు ఉండే అవకాశం ఉన్నందున, వీటిని ఇడ్లీ పాత్రలో వేసి ఆవిరిపై 5 నుండి 7 నిమిషాలు ఉడికించాలి..
గమనిక… ఏదైనా తీవ్రతరమైనప్పుడు కచ్చితంగా డాక్టర్ సలహా మేరకే వేటినైనా వాడగలరు…