ఓయో హోటల్‌లో గదిలో శిరీషది హత్యే. తేల్చిన పోలీసులు..!!?..

హైదరాబాద్‌: రెండు రోజుల కిందట.. ఓ ఓయో జంట హోటల్‌లో దిగింది. ఈ ఉదయం చూసేసరికి యువతి విగత జీవిగా కనిపించింది. వెంట వచ్చిన యువకుడు కనిపించకపోవడంతో పోలీసులకు సిబ్బంది సమాచారం ఇచ్చారు..అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గంటల వ్యవధిలోనే మిస్టరీని చేధించారు.

ఎస్సార్‌ నగర్‌లోని ఓ హోటల్‌లో యువతి మృతిని పోలీసులు హత్యగా నిర్ధారించుకున్నారు. ఆమెతో వచ్చిన వ్యక్తే హత్య చేసి పరారైనట్లు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. మృతురాలిని వికారాబాద్‌ జిల్లా ధరూర్‌కు చెందిన శిరీషగా గుర్తించారు.

శిరీష కోటిపల్లికి చెందిన శ్రీనివాస్‌తో ప్రేమలో ఉంది. రెండు రోజుల కిందట ఇంటి నుంచి పారిపోయిన ఈ జంట.. హైదరాబాద్‌కు వచ్చింది. ఎస్సార్‌ నగర్‌లోని ఓ ఓయో హోటల్‌లో గది తీసుకుని బస చేసింది. అయితే ఏం జరిగిందో తెలియదు. మంగళవారం ఉదయం శిరీష రక్తపు మడుగులో మంచం మీద కనిపించింది. శ్రీనివాస్‌ కనిపించకపోవడంతో అతని ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు…ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని పోలీసులు రూమ్‌లోని పరిస్థితుల్ని బట్టి అంచనా వేస్తున్నారు. గదిలో మద్యం సేవించడంతో పాటు ఆహారం మధ్యలోనే వదిలేసిన ఆనవాళ్లు ఉన్నాయి. శిరీష కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు.. శ్రీనివాస్‌ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఘటనకు ముందు గదిలో ఏం జరిగింది? ఇద్దరి మధ్య గొడవకు కారణమేంటి? ఏ పరిస్థితుల్లో శిరీష మృతి చెందింది? హత్య అనంతరం శ్రీనివాస్‌ ఎక్కడికి వెళ్లాడు? అనే కోణాల్లో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు..