రాముడు ఎక్కువ బంగారు ఆభరణాలు వేసుకుని ధనికూడు., కానీ శివుడు పేదవాడు..– టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..
అవును రాముడు ధనికుల దేవుడే…
రేవంత్ రెడ్డి మాటలను నేను సమర్ధిస్తున్నాను…రాముడు ఎక్కువ బంగారు ఆభరణాలు వేసుకుని ధనికుడిలా కనిపించేవాడు, కానీ శివుడు పేద వాడిలా కనిపిస్తాడు..– టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..
న్యూఢిల్లీలో జరిగిన ఒక కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉత్తరాది వారు రాముడి భక్తులని, దక్షిణాది వారు శివుడి భక్తులని పేర్కొన్నారు. అలాగే, “రాముడు ధనికుల దేవుడని, శివుడు పేదల దేవుడని” వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మహేష్ కుమార్ గౌడ్ వివరణ: దీనిపై తీవ్ర రాజకీయం నడుస్తున్న తరుణంలో, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డిని సమర్థిస్తూ మీడియాతో మాట్లాడారు. “సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను ఆయనను సమర్థిస్తున్నాను. చూసే రూపం పరంగా (Look-wise), శ్రీరాముడు ఎక్కువ ఆభరణాలు ధరించి ధనికుడిలా కనిపిస్తాడు, కానీ శివుడు వస్త్రాలు లేకుండా శారీరకంగా పేదవాడిలా కనిపిస్తాడు. ఇదే వారి మధ్య ఉన్న వ్యత్యాసం. అయితే మాకు ఇద్దరు దేవుళ్లూ సమానమే, ఇద్దరినీ మేము పూజిస్తాము” అని ఆయన స్పష్టం చేశారు..
ముస్లిం అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే ముస్లిం’ అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు దేవుళ్ల మధ్య కూడా రాజకీయ చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. ‘దక్షిణ కాశీ’ వేములవాడ, ‘దక్షిణ అయోధ్య’ భద్రాచలం ఉన్న తెలంగాణలో సీఎంగా ఉన్న వ్యక్తి మరింత బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు.శివుడు హాలాహలం తాగి నీలకంఠుడైతే.. కాంగ్రెస్ మాత్రం కులాలు, ప్రాంతాల మధ్యేకాకుండా ఇప్పుడు శివుడికి, రాముడికి మధ్య హాలాహలం చిమ్ముతోందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో హామీల కోసం దేవుళ్లను సాక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి… నేడు అదే దేవుళ్లకు ప్రాంతాలు, వర్గాలు ఆపాదించడం శోచనీయమన్నారు. ‘శివాయ విష్ణురూపాయ.. శివరూపాయ విష్ణవే’ అనే సనాతన ధర్మ సత్యం ప్రకారం హరిహరులను ఏకం చేయాలే తప్ప విడదీయకూడదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను వాడుకోవడం మానుకోవాలని బిజేపి నాయకులు సూచించారు.