నాలుగు భయంకర తుఫానులు..!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి చూస్తే మన గ్రహం ఎంత అందంగా కనిపిస్తుందో, కొన్నిసార్లు ప్రకృతి ఎంత భయానకంగా మారుతుందో కూడా స్పష్టమవుతుంది..సెప్టెంబర్ 27వ తేదీన పసిఫిక్ మహాసముద్రం అంతులేని అల్లకల్లోలానికి కేంద్రంగా మారింది.
https://x.com/i/status/2104610335265046788
వేలాది కిలోమీటర్ల దూరంలో ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఏకంగా నాలుగు భారీ తుఫానులు విరుచుకుపడ్డాయి. ఈ భీకర దృశ్యాలను అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్ కెమెరాలు స్పష్టంగా బంధించడంతో ప్రపంచం నివ్వెరపోయింది..

పశ్చిమ పసిఫిక్‌లో సురిగే టైఫూన్ భీభత్సం

తూర్పు పసిఫిక్‌లో తుఫానుల జోరు ఇలా ఉంటే, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఫిలిప్పీన్స్ తూర్పు భాగంలో పుట్టుకొచ్చిన ‘సురిగే’ టైఫూన్ మరింత శక్తివంతంగా తయారైంది. జపాన్‌లోని ఒకినావా దీవుల వైపు కదులుతూ ఇది అత్యంత ప్రమాదకరమైన టైఫూన్‌గా రూపాంతరం చెందింది. సెప్టెంబర్ 29 నాటికి కూడా జపాన్‌కు దక్షిణాన శక్తివంతంగా కొనసాగిన ఈ తుఫాను, ఆ తర్వాత వాతావరణ పరిస్థితుల కారణంగా క్రమంగా బలహీనపడటం ప్రారంభించింది..

ఒకే సముద్రంలో నాలుగు రాక్షస తుఫానుల తాండవం

పసిఫిక్ సముద్రంలో సంచలనం సృష్టించిన ఈ నాలుగు తుఫాను వ్యవస్థల్లో ‘నోలో’ (Nolo), ‘పోలో’ (Polo) హరికేన్లు, ‘ఒడాలిస్’ (Odalys) ఉష్ణమండల తుఫానుతో పాటు పశ్చిమ పసిఫిక్‌లో ‘సురిగే’ (Surigae) టైఫూన్ ఉన్నాయి. హవాయి దీవుల దిశగా కదిలిన నోలో హరికేన్ గంటకు సుమారు 185 కిలోమీటర్ల వేగంతో భీకర గాల్లులతో చెలరేగింది. ఇక మరోవైపు పోలో హరికేన్ ఊహించని రీతిలో అత్యంత వేగంగా బలపడి కేటగిరీ-5 స్థాయికి చేరుకుంది. దీని గాలి వేగం గంటకు ఏకంగా 285 కిలోమీటర్లకు పైగా పుంజుకోవడం సముద్ర గర్భంలో ఎలాంటి విధ్వంసం జరిగిందో తెలియజేస్తోంది.

తీరాన్ని వణికించిన పోలో, ఒడాలిస్ ఉధృతి

భారీ శక్తిని సంతరించుకున్న పోలో హరికేన్ సెప్టెంబర్ 29 నాటికి బాజా కాలిఫోర్నియా సుర్ ప్రాంతంలో కేటగిరీ-2 తుఫానుగా తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో ఆ ప్రాంతంలో పెనుగాలులు వీయడంతో పాటు ఆకస్మిక వరద ముప్పు ముంచెత్తింది. ఇదే సమయంలో మరోవైపు ఉద్భవించిన ఒడాలిస్ తుఫాను తొలి రోజుల్లో తీవ్ర రూపం దాల్చినప్పటికీ, ఆ తర్వాత వేగంగా బలహీనపడి సాధారణ వాతావరణ వ్యవస్థగా మారిపోయింది. ఇలా ఒకే సముద్రంలో కొన్ని తుఫానులు తీవ్రరూపం దాల్చుతుంటే, మరికొన్ని బలహీనపడే దశలో ఉండటం విశేషం.