174 మందిని కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్..

174 మందిని కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ విజువల్స్..

https://www.facebook.com/share/r/1GwvN459wD/

ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో ఊహించని భయాందోళన.. తోటి కో-పైలటే విమానాన్ని కూల్చివేసేందుకు కత్తితో దాడికి తెగబడ్డాడు.. తీవ్రంగా గాయపడి, శరీరం నుంచి రక్తం కారుతున్నా సరే.. అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి 180 మంది ప్రాణాలను కాపాడారు ఒక భారతీయ పైలట్! ముంబైకి చెందిన కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ చూపిన అసమాన ధైర్యం, తెగువ వల్ల ప్రపంచం మరో 9/11 తరహా విషాదం నుంచి తప్పించుకుంది!.

కో-పైలట్ కత్తి దాడిలో గాయపడిన ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ తొలి దృశ్యాలు బయటపడ్డాయి..

ఛాతీ, కడుపు చుట్టూ భారీ బ్యాండేజీలతో విమానం బయట కనిపిస్తున్నారు. సౌదీ అరేబియాలోని తబుక్ ఆసుపత్రిలో తొలి చికిత్స అనంతరం మరింత చికిత్స కోసం యూఏఈకి తరలిస్తున్నారు.

ఎక్కువ రక్తం పోయిందని, మొదట ప్రాణాపాయం ఉంటుందని భావించామని వైద్యులు చెప్పారు. అయినా కాక్‌పిట్ తలుపు తెరిచి 174 మంది ప్రాణాలు కాపాడారు. విమానం తబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది…

సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ (FZ1073) బోయింగ్ 737 విమానం గాల్లో ఉండగా ఈ దారుణం జరిగింది. విమానంలో 27 మంది చిన్నారులు, ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తం 180 మంది ఉన్నారు. ప్రయాణం మధ్యలో ఒమన్ జాతీయుడైన కో-పైలట్ ఉన్నట్టుండి విమానాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నాడు. కాక్‌పిట్ సిస్టమ్స్‌ను నిలిపివేసి విమానాన్ని కిందకు దించేందుకు యత్నించాడు.

దీనిని గమనించి అడ్డుకోబోయిన ప్రధాన పైలట్ (ఫస్ట్ ఆఫీసర్) స్మిత్ మచ్ఛార్‌పై కో-పైలట్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన స్మిత్, రక్తమోడుతూ కాక్‌పిట్ నేలపై పడిపోయారు. అయినా సరే, సగం స్పృహలోనే చాకచక్యంగా కాక్‌పిట్ తలుపుల రిలీజ్ బటన్‌ను నొక్కారు. దీనితో వెంటనే కాక్‌పిట్ తలుపులు తెరుచుకున్నాయి. అలర్ట్ అయిన విమాన సిబ్బంది, ఒక ఇజ్రాయెల్ ప్రయాణికుడు లోపలికి ప్రవేశించి ఉన్మాది అయిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అప్పటికే విమానం వేగంగా కిందకు పడిపోతూ అత్యవసర సిగ్నల్స్ పంపింది. ప్రయాణికులు, సిబ్బంది సహాయంతో కో-పైలట్‌ను కట్టడి చేసిన అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లోని ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దెల్ అజీజ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు..

ముంబైలోని ఘాట్‌కోపర్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన స్మిత్ మచ్ఛార్ జీవిత ప్రయాణం ఎంతో ఆసక్తికరమైనది! చిన్నప్పుడు కుటుంబానికి చెందిన టెక్స్‌టైల్ వ్యాపారంలోకే వెళ్లాలని భావించారు. స్కూల్ విద్య పూర్తయ్యాక టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతుండగా ఒక ఏవియేషన్ సెమినార్‌కు హాజరయ్యారు. అక్కడే ఆయనకు పైలట్ కావాలనే ఆసక్తి కలిగింది. 2007-2008 సమయంలో వెలింగ్‌కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు.

తన 19 ఏళ్ల వయసులో పైలట్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు కుటుంబంలో భిన్నమైన స్పందన వచ్చింది. గతంలో జలక్ మెహతా అనే పాడ్‌కాస్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ ఈ విషయాలను గుర్తుచేసుకున్నారు. “మా అమ్మ చాలా భయపడింది. 15-17 ఏళ్ల క్రితం ఏవియేషన్ రంగం ఇప్పుడు ఉన్నంత విస్తృతంగా లేదు. పైలట్లు అయ్యేవారు చాలా తక్కువ మంది ఉండేవారు. విమానాలు నడపడం అనే విషయాన్నే అమ్మ భయంగా భావించేది. కానీ నాన్న చాలా ప్రశాంతంగా నా నిర్ణయాన్ని సమర్థించారు,” అని స్మిత్ చెప్పారు..

కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాల గురించి ప్రధాని మోదీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పంచుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో.. “కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఒక హీరో. అత్యంత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొని, తీవ్రంగా గాయపడినప్పటికీ, ఇతరుల ప్రాణాలను కాపాడటానికి అతను అపారమైన ధైర్యాన్ని, అచంచలమైన సంకల్పాన్ని ప్రదర్శించాడు. ఆయన ధైర్యం వందలాది ప్రాణాలను కాపాడి, ఒక పెద్ద విషాదాన్ని నివారించింది. కెప్టెన్ మచ్చర్ పట్ల భారతదేశం గర్వపడుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని, తిరిగి బలం పుంజుకోవాలని, మంచి ఆరోగ్యం పొందాలని మేము ప్రార్థిస్తున్నాము” “దాడికి గురైన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్, గాయపడినప్పటికీ ఎదురుదాడి చేసి 9/11 వంటి భారీ విపత్తును నివారించారు” అని నెతన్యాహు అన్నారు. అదనంగా, Xలో ఒక పోస్ట్‌లో నెతన్యాహు, “భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ యొక్క అసాధారణ ధైర్యసాహసాలకు నేను సెల్యూట్ చేస్తున్నాను” అని పేర్కొన్నారు.

కెప్టెన్ మచ్చర్‌‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
ప్లై దుబాయ్ విమానంలో తన ప్రాణాలను ఎదురొడ్డి 180 మందిని ప్రయాణికులకు కాపాడిన పైలట్ స్మిత్ మచ్చర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అనుకోకుండా ప్రమాదం ఎదురైనప్పుడు తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను రక్షించేందుకు కెప్టెన్ స్మిత్ గొప్ప ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఆయన చూపిన తెగువ ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఒక్కమాటలో చెప్పాలంటే పెను విషాదం తప్పింది. మచ్చర్‌ను చూసి యావత్త భారత్‌ గర్విస్తోందని, ఆయన వేగంగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నానని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు ప్రధాని మోదీ.