నాకు ఎమ్మెల్సీ టికెట్ వద్దు..ఎమ్మెల్యే టికెటే కావాలి

నాకు ఎమ్మెల్సీ టికెట్ వద్దు..ఎమ్మెల్యే టికెటే కావాలి

కాంగ్రెస్ నాయకుల్లో ఎన్నికలో కొత్త టెన్షన్.

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడని సర్వోత్తమ్ రెడ్డి..

బదులుగా సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సీనియర్ నాయకులను కోరుతున్న వైనం, అభ్యర్థి మార్పు కుదరదని తేల్చి చెప్పిన అధిష్టానం..

వరంగల్–నల్గొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో అభ్యర్థిగా తన పేరు చూసి సర్వోత్తమ్ రెడ్డి షాక్‌కు గురైనట్టు సమాచారం..

తనకు ఎలాంటి సమాచారం లేకుండా తన పేరును ప్రకటించారని, అసలు పోటీ చేసే ఆలోచనే లేదని చెప్తున్న సర్వోత్తమ్ రెడ్డి..

అయితే తన తండ్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి రాజకీయ అనుబంధం ఉన్న సూర్యాపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని సీనియర్ నాయకులను కలిసి చెప్తున్నట్టు సమాచారం..

అయితే అభ్యర్థిని మార్చడం కుదరదని, నువ్వే పోటీ చేయాలని సర్వోత్తమ్ రెడ్డిని బుజ్జగించే పనిలో పడ్డ కాంగ్రెస్ పార్టీ..

ఆరుగురు మంత్రులు ఉన్నా ఎందుకింత దుర్భర స్థితి.!

అందరూ హేమాహేమీలే అయినా ఎందుకీ పరిస్థితి.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (MLC) స్థానానికి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖత..

ఆయనకు ఎమ్మెల్సీ సీటు వద్దు అని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశిస్తున్నట్లు సమాచారం.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ కోసం తాను ఎవరినీ సంప్రదించలేదని, తనతో ముందస్తుగా మాట్లాడకుండానే అభ్యర్థిగా పేరు ప్రకటించడంపై ఆయన ఆశ్చర్యం, అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఈ విషయమై ఆయన పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలను, మంత్రులను కలిసి తన అభిప్రాయాన్ని, సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ ఆకాంక్షను తెలియజేస్తున్నారు.

ఒకసారి అభ్యర్థిని ప్రకటించాక మార్చడం పార్టీకి సరైన సంకేతం కాదని, అభ్యర్థి మార్పు కుదరదని పార్టీ స్పష్టం చేస్తోంది. సర్వోత్తమ్ రెడ్డిని బుజ్జగించి పోటీ బరిలో ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.. అయితే ఇది ఎంత వరకు నిజము అనేది స్పష్టత రావాల్సి ఉంది..