ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. నిమిషాల్లో భూమి మాయమైంది. 51మంది మృతి చెందారు. 27మంది బాలికలు కనిపించకుండా పోయారు. ఇదీ.. అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాక్ రాష్ట్రానికి సంభవించిన వరదల విలయతాండవం..
కెర్ కౌంటీలో వరదల కారణంగా 15 మంది పిల్లలు సహా కనీసం 43 మంది మరణించారు. సమీపంలోని కౌంటీలలో కనీసం ఎనిమిది మంది చనిపోయారు..విధ్వంసకరంగా కనిపిస్తున్న చెట్లు.. బోల్తాపడి చెట్ల మీద, కల్వర్టుల మీదా కూర్చొన్న కార్లు, బురదతో నిండిన శిథిలాలతో సెంట్రల్ టెక్సాస్ భయానకంగా మారింది..
అటు, శనివారం కూడా శాన్ ఆంటోనియో వెలుపల వర్షాలు కురుస్తూనే ఉండటంతో ప్రమాద హెచ్చరికలు జారీ అవుతూనే ఉన్నాయి. ఆకస్మిక వరద హెచ్చరికలు ఇంకా కొనసాగుతున్నాయి…
గ్వాడాలుపే నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక నివాసాలు నీట మునిగాయి. వీధుల్లోకి భారీగా వరద నీరు చేరింది. వరదల్లో చిక్కుకున్న దాదాపు 200 మందికి పైగా ప్రజలను రక్షించారు. 24 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు ధ్రువీకరించారు. చాలా మంది గల్లంతు కావడంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వరదల నేపథ్యంలో టెక్సాస్ లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా టెలీ కమ్యూనేషన్ కు సంబంధించి అన్ని సంబంధాలు తెగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు నిల్వ చేసుకున్న ఆహార పదార్ధాలు వర్షానికి కొట్టుకుపోయాయి. పలు గోదాములు కూడా వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ఇక ప్రభుత్వం రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వస్తున్నారు. అంతేకాదు కొంత మంది ఆహార పొట్లాలు అందజేసారు. అంతేకాదు వరదల కారణంగా నష్టపోయిన వారికి ఇన్సూరెన్స్ లేకపోయినా.. తిరిగి పునారావాసం కల్పిస్తామన్నారు. .
గమనిక…
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959