రెండో టెస్ట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది (Ind vs Eng). ఇంగ్లండ్‌పై సాధికారక విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌పై టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది..
అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ రాణించి ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఆకాష్ దీప్ ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్ వెన్ను విరిచారు. దీంతో టీమిండియా 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది.
శనివారమే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఐదో రోజు లంచ్ సమయానికి మరో మూడు వికెట్లు కోల్పోయింది. 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను జేమీ స్మిత్ (44 నాటౌట్), బెన్ స్టోక్స్ (33) ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అయితే ఈ జోడీని వాషింగ్టన్ సుందర్ విడదీశాడు. బెన్ స్టోక్స్‌ను ఆరో వికెట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు ఎవరూ భారత బౌలర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆకాష్ దీప్ ఆరు వికెట్లు దక్కించుకోగా, సిరాజ్, ప్రసిద్ధ్, వాషింగ్టన్ సుందర్, జడేజా ఒక్కో వికెట్ తీశారు.
ఇక, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రవీంద్ర జడేజా, జైస్వాల్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ అర్ధశతకాలు సాధించారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఆరు వికెట్లు తీసి పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆకాష్ దీప్ ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆకాష్ దీప్ మొత్తం పది వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 427/6 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులు చేసింది.
ఈ చారిత్రాత్మక విజయంపై టీమిండియా దిగ్గజలు స్పందించారు..
భారత క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ఎడ్జ్‌బాస్టన్‌లో ఇదే మొట్టమొదటి టెస్టు విజయం. తొలి టెస్టు ఓటమి నుంచి తేరుకున్న యంగ్ టీమిండియా.. రెండో టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి.. ఇంగ్లాండ్‌ను వాళ్ల సొంత గడ్డపై మట్టి కరిపించింది. అయితే.. ఈ చారిత్రాత్మక విజయంపై టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ ఎక్స్ వేదికగా స్పందించారు. మరి వాళ్లు ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే గొప్పగా నిలిచిన విరాట్ కోహ్లీ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు గొప్ప విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది. శుభ్‌మాన్ బ్యాట్‌తో, ఫీల్డ్‌లో అద్భుతంగా నాయకత్వం వహించాడు. అందరూ అద్భుతంగా ఆడారు. ఈ పిచ్‌పై బౌలింగ్ చేసిన విధానానికి సిరాజ్, ఆకాష్లను ప్రత్యేకంగా అభినందించాలి.’ అని పేర్కొన్నాడు.
అలాగే టీమిండియా తలరాతను మార్చిన కెప్టెన్‌గా కీర్తి పొందిన సౌరవ్ గంగూలీ సైతం ఎక్స్‌లో పోస్టూ చేస్తూ.. ‘శుభ్‌మన్ గిల్ అండ్ టీమ్ బ్యాట్‌తో బాల్‌తో అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆకాస్దీప్, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇంగ్లాండ్ బౌలింగ్ ఎటాక్ కంటే ఇండియన్ బౌలింగ్ ఎటాక్ చాలామెరుగ్గా కనిపిస్తోంది.. అకాస్దీప్, సిరాజ్ రేసుగుర్రాలు. బుమ్రా లేకుండా టీమిండియా గెలిచింది. గిల్ బాధ్యతతో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు’ అని తెలిపాడు. మరింత మంది మాజీ క్రికెటర్లు టీమిండియా సాధించిన ఈ ఘన విజయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు..
దుమ్ము లేపిన సిరాజ్, ఆకాష్ దీప్
టీమిండియా స్టార్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్ అలాగే ఆకాష్ దీప్ ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ దెబ్బకు టీమిండియా 336 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. టీమిండియా డేంజర్ ఆటగాడు బుమ్రా.. రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆడకపోయేసరికి గిల్ సేన అసలు గెలవద్దని అనుకున్నారు. కానీ రెండో టెస్ట్ మ్యాచ్ లో… సిరాజ్ భాయ్ అలాగే ఆకాష్ దీప్ ఇద్దరూ బాంబుల్లా రెచ్చిపోయారు.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. ఆకాష్ దీప్ అయితే ఈ రెండో టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా 10 వికెట్లు పడగొట్టి… ఇంగ్లాండు నడ్డి విరిచాడు. అటు తెలంగాణ డిఎస్పి మహమ్మద్ సిరాజ్ భాయ్… మొదటి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీయగా రెండో ఇన్నింగ్స్ లో వికెట్ తో పాటు అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఈ దెబ్బకు టీమిండియా బౌలర్ల చేతికి ఇంగ్లాండ్ బ్యాటర్లు హ్యాండ్ ఓవర్ కావాల్సి వచ్చింది.
మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన క్యాచ్
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో… డీఎస్పీ సిరాజ్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ లో వచ్చిన జోష్ టంగ్ రవీంద్ర జడేజా బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే టంగ్ క్యాచ్‌ను సిరాజ్ అద్భుతంగా అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అంతకుముందు వోక్స్ క్యాచ్ కూడా అందుకున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ టెస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో.. 587 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్ లో 6 వికెట్లు నష్టపోయి 427 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్ లో 407, రెండో ఇన్నింగ్స్ లో 271 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.