ఆధార్ కార్డును అప్డేట్ చేయలేదని ఫ్రీ టికెట్ ఇవ్వని కండక్టర్..
అరగంట పాటు బస్సును ఆపి గొడవ చేసిన మహిళలు..
https://x.com/r9telugunews/status/1952979880943206794
భైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పంచాయతీ..
ఆధార్ కార్డుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడంతో టికెట్ ఇవ్వని కండక్టర్…
దేగామ్ గ్రామం వద్ద బస్సును అరగంట పాటు ఆపి గొడవకు దిగిన మహిళలు..
మహిళలకు ఈ సౌకర్యం వచ్చిన తర్వాత బస్సుల్లో ఎప్పుడూ ఎదో ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. ఇక (Aadhar card update) ఆధార్ అప్డేట్ లేకుంటే మాత్రం కండక్టర్లు ఫ్రీ టికెట్ ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అప్డేట్ లేకపోతే టికెట్కు డబ్బులు ఇవ్వాలని కండక్టర్లు చెబుతున్నారు. లేదంటే బస్సులను నడిరోడ్డుపై ఆపి మహిళలను దించేసిన ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా ఆధార్ కార్డు అప్డేట్ లేకుంటే ఫ్రీ బస్ టికెట్ ఇవ్వనని తేల్చి చెప్పిన కండక్టర్.. దీంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మేం గతం నుండి కూడా ఇదే ఆధార్ కార్డుపై తిరుగుతున్న ఈ రోజు నువ్వు కొత్తగా రూల్స్ తీసుకొచ్చావు ఏమిటంటే ఆగ్రహం వ్యక్తం చేస్తూ కండక్టర్ పై గొడవకు దిగారు…