అహ్మదాబాద్‌ టెస్ట్‌: తొలిరోజు ఆట ముగిసే సమయానికి ..

అహ్మదాబాద్‌ టెస్ట్‌: తొలిరోజు ముగిసిన ఆట
ఆట ముగిసే సమయానికి భారత్ 121/2
క్రీజులో కేఎల్ రాహుల్ 53, గిల్‌ 18 పరుగులు..

తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 162 పరుగులకు ఆలౌట్..

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి రోజు భారత్ ఆధిపత్యం చెలాయించింది, కెప్టెన్ రోస్టన్ చేజ్ బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత పర్యాటక జట్టును 162 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ తర్వాత ఆతిథ్య జట్టు 121/2తో రోజు ముగియడంతో KL రాహుల్ తన 20వ టెస్ట్ అర్ధ సెంచరీని నమోదు చేశాడు..

కెఎల్ రాహుల్ యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు – టెస్ట్ క్రికెట్‌లో అతనికి ఇది 20వది!…

యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7 పరుగులు చేసి ఔటయ్యారు. వెస్టిండీస్‌ బౌలర్లలో జైడన్, రోస్టన్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 44.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది..

వెస్టిండీస్‌ బ్యాటర్లలో జాన్ క్యాంప్‌బెల్ 8, చంద్రపాల్ 0, అలిక్ అతనాజే 12, బ్రాండన్ కింగ్ 13, రాస్టన్ చేజ్ 24, షై హోప్ 26, జస్టిన్ గ్రీవ్స్ 32, ఖారీ పియెర్ 11, వారికాన్ 8, జోహాన్ లేన్ 1, జేడెన్ సీల్స్ 6 పరుగులు తీశారు.

ఒకే ఏడాదిలో 600 పరుగుల మార్క్

ఈ అర్ధశతకంతో కేఎల్ రాహుల్‌ ఈ ఏడాది చేసిన పరుగుల మొత్తం 600 పరుగుల మార్క్‌ను దాటింది. 2017 తర్వాత తొలిసారి టెస్టుల్లో ఒకే ఏడాదిలో అతడు 600 పరుగులకు మించి చేశాడు. 2017లో రాహుల్ 633 పరుగులు చేశాడు. 2025లో ఆయన సగటు 50. తన కెరీర్‌లో తొలిసారి ఒకే ఏడాదిలో 700 పరుగుల మార్క్‌ను కూడా దాటే అవకాశం ఉంది…

తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ నాలుగు కీలక వికెట్లు పడగొట్టి, కరేబియన్ జట్టు టాప్ ఆర్డర్‌ను చాప చుట్టేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో 2025 క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు (31 వికెట్లు) సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా బౌలర్లు మిచెల్ స్టార్క్ (29 వికెట్లు), నాథన్ లైయన్ (24 వికెట్లు), వెస్టిండీస్ పేసర్ షామర్ జోసెఫ్ (22 వికెట్లు)లను వెనక్కి నెట్టాడు.

సిరాజ్ ఇటీవలి కాలంలో టీమ్ఇండియా బౌలింగ్ దళంలో కీలక ఆటగాడిగా మారాడు. కొత్త బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ఆటలోకి రానీయకుండా చేయడంలోనూ, క్రీజులో స్థిరపడిన ఆటగాళ్లను తన వేగవంతమైన బౌ లింగ్‌తో పెవిలియన్‌కు చేర్చడంలోనూ సిద్ధహస్తుడిగా నిరూపించుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో బౌలింగ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సిరాజ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా ఐదో టెస్టులో జట్టు విజయం సాధించి సిరీస్‌ను సమం చేయడంలో అతడి పాత్ర కీలకంగా నిలిచింది. ప్రస్తుత వెస్టిండీస్ సిరీస్‌లోనూ తన నాలుగు వికెట్లతో మ్యాచ్‌ను భారత్ వశం చేసుకునేలా చేశాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో సిరాజ్ తన స్థాయిని మరోసారి చాటాడు. టీమ్ ఇండియాకు టెస్టు ఫార్మాట్‌లో విజయాలను అందిస్తూ బౌలింగ్ రీతిలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాడు..