సంపత్ కుమార్ కొంప ముంచిన 8 కోట్ల వసూళ్ల వ్యవహారం
ఏఐసీసీ సెక్రెటరీ పదవి నుండి తొలగించిన అధిష్టానం..
గద్వాల జిల్లా బీచుపల్లి – అలంపూర్ నేషనల్ హైవే 44 పై 6 లేన్ల పనులను దక్కించుకున్న భ్రమర ఇన్ ఫ్రా
ఈ పనులు జరగాలంటే తనకు రూ.8 కోట్ల కమిషన్ డబ్బులు ఇవ్వాలంటూ జనవరి 6న రోడ్డు పనులు జరుగుతున్న స్థలానికి TS33E6768 అనే నంబరు గల కారులో వచ్చి మారణాయుధాలతో బెదిరించిన సంపత్ అనుచరుడు ఆకేపోగు పీటర్సన్
కాంట్రాక్ట్ పనులు ఆపేసి బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భ్రమర ఇన్ ఫ్రా సంస్థ అధిపతి జగదీష్ ప్రసాద్
ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతల నుండి ఆదేశాలు రావడంతో కేసు నమోదు చేయకుండా, ఫిర్యాదు కాపీలను మాయం చేసిన పోలీసులు
కేంద్ర నిధులతో జరిగే నేషనల్ హైవే పనుల్లో కూడా కమిషన్లు కావాలంటూ సంపత్ ఒత్తిడి
రూ.8 కోట్లు కమిషన్ ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించిన సంపత్ కుమార్..
కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సంస్థాగత మార్పుల్లో భాగంగా 81 మందితో కూడిన నూతన ఏఐసీసీ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల జాబితాను విడుదల చేసింది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం 25 మంది సిట్టింగ్ కార్యదర్శులను బాధ్యతల నుండి తప్పించగా, అందులో సంపత్ కుమార్ కూడా ఉన్నారు…..మీనాక్షి నటరాజన్ స్థానంలో నియమితులైన బీఎం సందీప్‌ను సైతం కాంగ్రెస్ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 81 మందితో నూతన కార్యదర్శుల నియామకాల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.ఈ జాబితాలో తెలంగాణ నుంచి అజ్మత్ హుస్సేన్, కోలుకొండ సతీష్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశా కార్యదర్శిగా ఉన్న జెట్టి కుసుమ్ కుమార్‌ను అదే పదవిలో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు..