గంటలో 140 సార్లు రేవంత్ రెడ్డి మా పేర్లు తలుచుకున్నాడు..అంటే నీకు ఎంత భయం పట్టుకున్నదో చూడు.. హరీష్ రావు..

గంటలో 140 సార్లు రేవంత్ రెడ్డి మా పేర్లు తలుచుకున్నాడు..

అంటే నీకు ఎంత భయం పట్టుకున్నదో చూడు

ఇందిరమ్మ జీవిత బీమా మీద సభ పెట్టి దాని గురించి మాట్లాడకుండా కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, నన్ను 140 సార్లు తలుచుకున్నాడు

63 సార్లు కేసీఆర్ పేరు, 53 సార్లు నా పేరు, 24 సార్లు కేటీఆర్ పేరు తీశాడు- హరీష్ రావు..

అందులో కేసీఆర్ పేరును 63 సార్లు, తన పేరును 53 సార్లు, కేటీఆర్ పేరును 24 సార్లు తీశారని హరీష్ రావు లెక్కలతో సహా ఆరోపించారు….

ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు…

దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో కాంగ్రెస్ త‌ర‌ఫున‌ నా మీద పోటీ చెయ్ అని మాజీ మంత్రి హ‌రీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. నిన్న సిద్దిపేట‌లో సీఎం ప‌ర్య‌ట‌న‌పై హ‌రీశ్ రావు స్పందించారు. ఇందిరమ్మ జీవిత బీమా మీద సభ పెట్టి దాని గురించి మాట్లాడకుండా కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, నన్ను 140 సార్లు తలుచుకు న్నాడు. 63 సార్లు కేసీఆర్ పేరు, 53 సార్లు నా పేరు, 24 సార్లు కేటీఆర్ పేరు తీశాడ‌ని అంటే నీకు ఎంత భయం పట్టుకున్నదో చూడు అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్, సబ్‌వర్ట్, పర్వర్ట్ చంద్రబాబు జలదోపిడీకి సహకరించే కోవర్ట్, వ్యవస్థను భ్రష్టు పట్టించిన సబ్‌వర్ట్, వికృత మనస్తత్వం కలిగిన పర్వర్ట్ అని ఘాటుగా స్పందించారు. తెలంగాణకు నువ్వు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తాను. దమ్ముంటే అసెంబ్లీ పెట్టి మైక్ కట్ చేయకుండా ఉండు రేవంత్ రెడ్డి అని స‌వాల్ విసిరారు…