Air India pilot..ఎయిర్ ఇండియా పైలట్‌కు డోప్ టెస్ట్‌లో పాజిటివ్.. తీవ్ర కలకలం….!

చాలామంది నా మాటలను ఎగతాళి చేశారు... ప్రత్యక్ష సాక్షి..

ఎయిర్ ఇండియా పైలట్‌కు డోప్ టెస్ట్‌లో పాజిటివ్.. తీవ్ర కలకలం.

ఫుకెట్‌–ఢిల్లీ ఎయిర్ ఇండియా AI2379 విమానంలో చోటుచేసుకున్న తీవ్ర గందరగోళానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. విమానం నడిపిన పైలట్-ఇన్-కమాండ్ (PIC) నిర్ధారణ డోపింగ్ పరీక్షలో మారిజువానా (గంజాయి)కు పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి..

ఆగస్టు 4న ఈ విమానం సుమారు 300 అడుగుల ఎత్తు అకస్మాత్తుగా కోల్పోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. విమానంలోని కో-పైలట్ పరిస్థితిని అదుపులోకి తీసుకుని విమానాన్ని సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.

విమానాశ్రయంలో నిర్వహించిన ప్రారంభ డ్రగ్ స్క్రీనింగ్‌లో PIC ఫలితం ‘నాన్-నెగెటివ్’ రావడంతో నమూనాలను నిర్ధారణ పరీక్షకు పంపారు. తాజాగా వచ్చిన నిర్ధారణ పరీక్షలోనూ మారిజువానా ఉన్నట్లు తేలిందని సమాచారం..

ఇదిలా ఉండగా, విమానంలోని క్యాబిన్ సిబ్బంది PIC ప్రవర్తనపై ఎయిర్‌లైన్‌కు ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై DGCA, AAIB దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. AAIB మాత్రం పూర్తి ఆధారాలు బయటకు వచ్చే వరకు ఘటనపై ముందస్తు నిర్ణయాలకు రావద్దని సూచించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎయిర్ ఇండియా CEO క్యాంప్‌బెల్ విల్సన్‌ను సమావేశానికి పిలిపించి, ఘటనపై దర్యాప్తు పురోగతి, భద్రతా చర్యలపై వివరణ కోరినట్లు రాయిటర్స్ నివేదించింది..
R9TELUGUNEWS.COM.

ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాలు..

నేను, నా సోదరుడు విమానం ఎక్కే చివరి ప్రయాణికులం. పైలట్ కూడా మాతోనే విమానం ఎక్కాడు. ‘విమానం సరైన సమయానికే బయలుదేరుతుందా? లేదా మేము ఆలస్యమయ్యామా?’ అని నేను అతనిని అడిగాను. దానికి అతను చాలా నిదానంగా స్పందించాడు. అతని కళ్లు ఎర్రగా ఉన్నాయి. మత్తులో ఉన్నాడని నేను అప్పుడే నా సోదరుడికి చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే’ అని ఆయన చెప్పారు.

‘పైలట్ మొదటి డోప్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడని తెలిసిన వెంటనే నేను నా సోదరుడికి ఫోన్ చేసి చెప్పాను. అంతకుముందు విమానాశ్రయం నుంచి బయటకు వచ్చే సమయంలో మీడియాతో మాట్లాడుతూ పైలట్ మత్తులో ఉన్నాడని చెప్పినప్పుడు చాలామంది నా మాటలను ఎగతాళి చేశారు. మీమ్స్ కూడా వేస్తూ, మత్తులో ఉన్న వ్యక్తి విమానాన్ని ఎలా నడుపుతాడంటూ ప్రశ్నించారు’ అని ఆ ప్రయాణికుడు గుర్తు చేసుకున్నారు…నా జీవితంలో మొదటిసారి ఒక పైలట్ కాక్పిట్ నుండి బయటకు వచ్చి, ప్రయాణికులు వీడియోలు రికార్డ్ చేయవద్దని బ్రతిమలాడటం చూశాను. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. అందులో అతను ‘చిన్న విషయాన్ని పెద్దది చేయకండి’ అని స్పష్టంగా అన్నాడు. తీవ్ర భయాందోళనల్లో ఉన్న సమయంలో రికార్డింగ్ గురించి ఎవరు ఆలోచిస్తారు? గాయపడిన వారికి సత్వర వైద్య చికిత్స అందించడం అతని ప్రధాన ఉద్దేశం కాదు. విచారణ తప్పించుకోవడానికే లక్నోలో సరైన వైద్య సదుపాయాలు లేవనే సాకుతో విమానాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఆ ప్రయాణికుడు ఆరోపించారు..