త్రయంబకేశ్వర్ ఆలయంలో VIP దర్శనాలపై కీలక నిర్ణయం..

త్రయంబకేశ్వర్ ఆలయంలో VIP దర్శనాలపై కీలక నిర్ణయం
రేపటి నుంచి సెప్టెంబర్ 13 వరకు VIP దర్శనాలపై ఆంక్షలు
మహారాష్ట్రలోని ప్రముఖ శైవ క్షేత్రం త్రయంబకేశ్వర్ ఆలయంలో VIP దర్శనాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రేపటి నుంచి సెప్టెంబర్ 13 వరకు VIP దర్శనాలు రద్దు చేయనున్నట్లు సమాచారం. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో రోజుకు కేవలం 20 మంది VIPలకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
శ్రావణ మాసం నేపథ్యంలో ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.