అల్లు అర్జున్‌. డ్రాగ్స్ వీడియోపై స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి..

డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్‌ టీమ్‌కు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్రత్యేక వీడియో చేసిన సంగతి తెలిసిందే..దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Tellangana CM Revanth Reddy) స్పందించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ”డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కల్పించేలా అల్లు అర్జున్‌ వీడియో చేయడం ఆనందంగా ఉంది. ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం” అని విజ్ఞప్తి చేశారు. #SayNoToDrugs వంటి పలు హ్యాష్‌ట్యాగ్స్‌ను జోడించారు.

సీఎం పోస్టుకు బన్నీ రిప్లై ఇచ్చారు. ”గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారు.. హైదరాబాద్‌ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు” అని పేర్కొన్నారు. ”మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్‌ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో టోల్‌ ఫ్రీ నెంబరు 1908కు ఫోన్‌ చేయండి. వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి.. సాధారణ జీవనశైలిలోకి వచ్చేవరకూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు. వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం” అని అల్లు అర్జున్‌ వీడియో ద్వారా పిలుపునిచ్చారు.

తాజాగా హీరోయిన్‌ రష్మిక (Rashmika) సైతం షీటీమ్‌కు సపోర్ట్‌గా ఓ వీడియో చేశారు. బయటకు వెళ్లే అమ్మాయిలెవరూ భయపడొద్దని, ఒకవేళ అన్యాయం జరిగితే షీ టీమ్‌ని ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు…