🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 30 – 11 – 2024,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయణం,
శరదృతువు,
కార్తీక మాసం,
బహుళ పక్షం,
తిథి : చతుర్దశి ఉ9.35 వరకు,
నక్షత్రం : విశాఖ మ12.34 వరకు,
యోగం : అతిగండ సా5.29 వరకు,
కరణం : శకుని ఉ9.35 వరకు,
తదుపరి చతుష్పాత్ రా10.17 వరకు,
వర్జ్యం : సా4.52 – 6.35,
దుర్ముహూర్తము : ఉ6.16 – 7.44,
అమృతకాలం : తె3.12 – 4.56,
రాహుకాలం : ఉ9.00 – 10.30,
యమగండం : మ1.30 – 3.00,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 6.16,
సూర్యాస్తమయం: 5.20,
*_నేటి మాట_*
*” మా కురు ధన జన యౌవన గర్వం”*
మనిషికి అహంకారం అనేది అనేక కారణాల నుంచి వస్తుంది.
కొంతమందికి తాను గొప్ప శ్రీమంతుడను అని, కొంతమందికి తాను పండితుడను అని, కొంతమందికి తాను మహాబలశాలి అని, అహంకారం, కొంతమందికి అన్నీ నాకే తెలుసు అని, ఇంకొంత మందికి పది మంది నన్ను పొగుడుతున్నారు, నన్ను మించిన వాడు ఈ ఊరిలో లేడని…
ఈ అహంకారం వచ్చిన వాడు రావణాసురుని వలె తప్పుడు పనులు చేస్తాడు.
రావణుడు సీతాపహరణమనే మహాపరాధం చేశాడు.
అప్పుడు ఎంతోమంది రావణాసురుడికి బుద్ధి చెప్పారు.
మాతామహులు మాల్యవంతుడు కూడా బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు, పెడచెవిని పెట్టాడు.
చివరికి సర్వనాశనం అయ్యాడు, ఆరంభంలోనే వివేకం తెచ్చుకొని అథవా పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు విని ఆపని చేయకుండా ఉన్నట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది.
వీటన్నిటికీ మూల కారణం అహంకారం.
అహంకారం మనిషి పతనానికి కారణం.
దానిని దూరం చేసుకోవాలి, భగవంతునికి ఇష్టమైన వాడు ఎవరు అంటే అహంకారం ఇసుమంతైనా లేనివాడు.
తృణాదపి సునీచేనా తరోరపి సహిష్ణునా
అమానినా మానదేన కీర్తనేయః సదా హరిః!!
ఎవరైతే లవణేశం కూడా అహంకారం లేకుండా ఉంటాడో, ఎవరైతే సదా ఓర్పుతో ఉంటాడో, వాడు భగవంతునికి ఇష్టమైన వాడు. అందుకే భగవత్పాదులు మనకు చెప్పిన మొట్టమొదటి మాట “మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వం” నువ్వు వేటిని చూసి అయితే అహంకార పడుతున్నావో అవి శాశ్వతం కాదు.
శాశ్వతమైనది ఒక్కటే భగవదనుగ్రహం, భగవదనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాడి జీవనం ఉత్తమంగా, పవిత్రంగా ఉంటుంది.
కేవలం మనయొక్క ఐశ్వర్యం, పాండిత్యం, బలాన్ని నమ్ముకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మన పతనానికి కారణం అవుతుంది…
_- శృంగేరి జగద్గురు వైభవం నుండి…_
*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏