సీఎం రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ కారణంగానే జరిగిందని, అతడు రాకపోతే తొక్కిసలాట జరిగేది కాదని, రేవతి కుటుంబం నష్టపోయేది కాదంటూ అసెంబ్లీలో మండిపడ్డారు..అంతేకాకుండా సినిమా ముందే ఇద్దరు చనిపోయారని చెప్పినా అల్లు అర్జున్ మూవీ మొత్తం చూసి వెళ్ళాడు..
పోలీసులను అతని దగ్గరకు సినిమా యాజమాన్యం వెళ్లనివ్వలేదు. ఏసీపీ వెళ్లిపోవాలని చెప్పినా అతడు వినలేదని.. అల్లు అర్జున్ నిజ స్వరూపం ఇదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రేవంత్ కు కౌంటర్ గా అల్లు అర్జున్ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు…
శనివారం తెలంగాణ అసెంబ్లీలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై హాట్ హాట్‌గా చర్చలు నడిచాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటనలో అసలు ఏం జరిగిందనేది.. అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. అంతేకాదు, సంధ్య థియేటర్ వద్ద అంత పెద్ద ఘటన జరిగి, ఓ తల్లి చనిపోయి, ఆ తల్లి కొడుకు హాస్పిటల్ ఉంటే ఒక్కరంటే ఒక్కరైనా పరామర్శకు రాలేదు. అల్లు అర్జున్ జైలు నుండి విడుదలగానే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంట్లో వాలిపోయింది అంటూ సినిమా వాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు తీసుకుని వారి వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ ప్రేక్షకుల, అభిమానుల ప్రాణాలతో చెలగాటం ఆడితే మాత్రం సహించం అంటూ.. సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో.. అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ.. సినిమా థియేటర్లు..
నూటికి నూరు శాతం తప్పుడు ఆరోపణలు..
నేను నటించిన సినిమా చూసి.. ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటే నేను మాత్రం బాధలోనే ఉన్నాను. కానీ నాకేం పట్టనట్టు ఉన్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేను మానవత్వం లేని మనిషిని కాదు. నూటికి నూరు శాతం నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు – అల్లు అర్జున్.
ఇది ఆకస్మాత్తుగా జరిగిన ప్రమాదం. ఇది ఎవరి తప్పు కాదు. మంచి ఇంటెన్షన్‌తో చేసినా కూడా యాక్సిడెంట్ జరిగింది. ఇది ఎవరి కంట్రోల్లో లేదు. ఇందులో ఎవరి తప్పూ లేదు. నేను ఎవరినీ తప్పు పట్టడం లేదు. బాధిత కుటుంబానికి క్షమాపణ చెబుతున్నాను. బాధితుడు త్వరలో కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. శ్రీతేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. ప్రేక్షకులను ఆనందింప చేయాలనే ఆలోచనే నాకు ఉంటుంది. థియేటర్ అంటే నాకు దేవాలయం వంటిది. అలాంటి థియేటర్లో యాక్సిడెంట్ జరిగిందంటే.. నాకంటే బాధపడేవారు ఎవరైనా ఉంటారా? శ్రీతేజ్ గురించి గంటగంటకు వాకబు చేస్తూనే ఉన్నాను. అతను కోలుకుంటున్నాడని తెలిసి చాలా సంతోషించాను. సంధ్య థియేటర్ ఘటన నిజంగా అత్యంత దురదృష్టకరం..
ఘటనపై మిస్ ఇన్ఫర్మేషన్, మిస్ కమ్యూనికేషన్ జరుగుతోందని అల్లు అర్జున్ తెలిపారు. థియేటర్ ఘటనలో తన క్యారెక్టర్‌ను కించపరిచారని బన్నీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వహననం జరిగిందని, కొందరి వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించినట్లు బన్నీ చెప్పారు. పుష్ప-2 సినిమా హిట్టయినా తాను ఇంట్లోనే కూర్చుని బాధపడుతున్నట్లు తెలిపారు. తాను ఎవ్వరినీ తప్పుపట్టడం లేదని, ప్రభుత్వంతో తాను ఎలాంటి వివాదం కోరుకోవడం లేదని అల్లు అర్జున్ వెల్లడించారు…
రేవతి చనిపోయిందనే విషయం నాకు నిజంగా తెలియదు..
నేను ఎన్నేఏళ్లుగా కష్టపడి సంపాదించిన పేరు ఇది. నా వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎలాంటి రోడ్ షో చేయలేదు. రేవతి చనిపోయిందనే విషయం కూడా నాకు తెలియదు. మరుసటి రోజు తెలిసింది. కానీ.. ఆ విషయం నాకు తెలిసినా కూడా అక్కడే ఉండి సినిమాచూశానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు..
నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు...
నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. నేను తెలుగు స్థాయి పెంచడానికి చేశా.. నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. థియేటర్ లో చూస్తేనే తెలుస్తుంది. మూడేళ్లు కష్టపడ్డాను. థియేటర్ లో చూస్తేనే నేను ఏం చేశానో తెలుస్తుంది. నా మీద వస్తున్నావని అవాస్తవం. అక్కడ రోడ్ షో ఏం చేయలేదు. జనం ఎక్కువైతే నా కారు ఆగిపోయింది. నేను కనిపిస్తేనే జనం జరుగుతారు అని నేను బయటకు వచ్చాను. ఫ్యాన్స్ కు నేను చెప్తేనే వింటారు అందుకే బయటకు వచ్చి అందరిని వెళ్ళమని చెప్పా.. థియేటర్ లో నేను చూస్తున్నప్పుడు నన్ను ఏ పోలీసులు కలవలేదు. నా మ్యానేజర్స్ చెప్తే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నాకు అక్కడ జరిగింది తెలియదు. తర్వాత రోజు నాకు తెలిసింది. నా పిల్లలు కూడా అక్కడ ఉన్నారు. నా పిల్లలను వదిలేసి నేను ఎలా వెళ్తాను. నాకు తెలిసిన వెంటనే బన్నీ వాసును పంపించా.. నేను కూడా వస్తా అని చెప్పా.. కానీ అప్పటికే నా మీద అప్పటికే వాళ్లు కేసు ఫైల్ చేశారు అని చెప్పారు అప్పటికీ నేను వెళ్తాను అన్నాను కానీ నా లాయర్లు వద్దు అన్నారు. నా ఫ్యాన్స్ ను కలవకుండా ఉండగలనా.. నేను షాక్ లో ఉన్నాను. ఇప్పుడు కూడా నేను షాక్ లోనే ఉన్నాను. సెలబ్రేషన్స్ మొత్తం ఆపేశాం.. ఆతర్వాత ఓ వీడియో పెట్టాను. నేను ఎప్పటికప్పుడు ఆ బాబు గురించి తెలుసుకుంటూనే ఉన్నాను..