మహారాష్ట్ర, కర్ణాటక ఘాట్లలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది ఉరకలెత్తుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి ప్రస్తుతం 1.30 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీని పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా, ఇప్పటికే 44.69 టీఎంసీలకు చేరింది. మరో కొన్ని రోజుల పాటు ఈ ప్రవాహం ఇలాగే కొనసాగితే, తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నీ త్వరలోనే జలకళ సంతరించుకోనున్నాయి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.