ప్రజల మధ్యకు నేను ధైర్యం వెళ్తుంటే ఆంబోతుల్లా.. అడ్డగాడిదల్లా నా కాళ్లలో ఎందుకు కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. కవిత..

బీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే ప్రజా సమస్యలపై పోరాటంలో మాతో పోటీ పడాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చాలెంజ్ చేశారు. నేను పార్టీ పెట్టుకుంటే ఎలాంటి భయం లేదని చెప్పిన బీఆర్ఎస్.. ఇప్పుడు ఎందుకు చాటుమాటుగా ఈసీకి ఫిర్యాదులు చేస్తోందని ప్రశ్నించారు. మా పార్టీకి సంబంధించిన న్యూస్ కవరేజ్ చేస్తున్న పత్రికలు, టీవీలకు హరీశ్ రావు, కేటీఆర్ ఫోన్ చేసి అడ్డుకుంటున్నారని ఇంత సిగ్గులేని వ్యవహారం ఎందుకని నిలదీశారు. ఓ ఆడబిడ్డగా ప్రజల మధ్యకు నేను ధైర్యం వెళ్తుంటే ఆంబోతుల్లా.. అడ్డగాడిదల్లా నా కాళ్లలో ఎందుకు కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన కవిత.. ఏనాటికైనా నేను తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తానని చాటుమాటుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారని కానీ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్ఎస్‍లో నేను కలిసేది లేదు ఆ పార్టీతో జతకట్టేదే లేదని స్పష్టం చేశారు.