అమరావతి: నేడు పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం.
ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ.
హాజరుకానున్న పలువురు మంత్రులు
పెట్టుబడులకు ప్రోత్సాహకాలపై నిర్ణయం
రూ.252.93 కోట్లతో ఫైరింజన్లు, అగ్నిమాపక పరికరాలు.
సా.4గంటలకు పరేడ్గ్రౌండ్స్లో ప్రారంభించనున్న సీఎం..
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ సంపూర్ణమైంది. ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు-2026 సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్కు చేరింది. సాయంత్రానికే దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. రాత్రి 10 గంటలకల్లా ‘గెజిట్ నోటిఫికేషన్’ కూడా వెలువడింది. దీంతో ‘అమరావతి’కి కేంద్ర స్థాయిలో చట్టబద్ధమైన రక్షణ లభించినట్లయింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం భారత ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ మణి ఈ గెజిట్ను విడుదల చేశారు. 2014నాటి రాష్ట్ర పునర్విభజన చట్టంలో… ‘పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత ఏపీకి ఒక కొత్త రాజధాని ఉంటుంది’ అని పేర్కొనగా… సవరణ చట్టంలో ‘ఏపీకి అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది’ అంటూ స్పష్టమైన వివరణ ఇచ్చారు. అలాగే సీఆర్డీయే చట్టం-2014 కింద నోటిఫై చేసిన ప్రాంతమంతా ‘అమరావతి’ పరిధిలోకి వస్తుందని మరో సవరణ చేశారు. వెరసి… 2024 జూన్ 2 నుంచే రాజధానిగా అమరావతి అమలులోకి వచ్చినట్లయింది..