అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఏపీ హైకోర్ట్ నిర్మాణానికి పునాది పనులు ప్రారంభించిన మంత్రి నారాయణ

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం
ఏపీ హైకోర్ట్ నిర్మాణానికి పునాది.పనులు ప్రారంభించిన మంత్రి నారాయణ.

B+G+7 అంతస్తుల్లో ఐకానిక్ భవనంగా హైకోర్టు నిర్మాణం

21లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో 52 కోర్ట్‌ హాల్స్‌
2, 4, 6వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు ఉంటాయి
8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం
2027 చివరికి ఏపీ హైకోర్టు నిర్మాణం పూర్తి చేస్తాం
-మంత్రి నారాయణ..

రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం మొదలైంది. న్యాయ వ్యవస్థకు ప్రతీకగా నిలిచే హైకోర్టు భవన నిర్మాణానికి తొలి అడుగు పడింది. అమరావతి రాజధానిలో హైకోర్టు భవనానికి సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను మంగళవారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి భూమిపూజ చేసి పనులను లాంఛనంగా ప్రారంభించారు.రాజధాని నిర్మాణం తిరిగి గాడిలో పడుతున్న నేపథ్యంలో హైకోర్టు పనుల ప్రారంభం అమరావతికి మరో మైలురాయిగా మారింది. గతంలో అర్థాంతరంగా నిలిచిపోయిన నిర్మాణ ప్రక్రియ తిరిగి ప్రారంభం అయింది. పరిపాలనా, న్యాయ వ్యవస్థలన్నీ ఒకేచోట ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుండగా, హైకోర్టు భవనం ఆ దిశగా కీలక పాత్ర పోషించనుంది.