దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి.. మీ రెడ్‌బుక్‌కి నేను భయపడను. అంబటి రాంబాబు.

దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి.. మీ రెడ్‌బుక్‌కి నేను భయపడను

చంద్రబాబు నుంచి ఆదేశాలు వచ్చాయండి అంటూ అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు

అరెస్ట్ చేసుకోండి.. జైలుకు వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పా.. i don’t care చంద్రబాబు

-అంబటి రాంబాబు, మాజీ మంత్రి, గుంటూరు జిల్లా అధ్యక్షులు ….

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోవాలంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. చంద్రబాబు నుంచి ఆదేశాలు వచ్చాయంటూ పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తే, జైలుకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. “మీ రెడ్‌బుక్‌కు నేను భయపడను.. ఐ డోంట్ కేర్ చంద్రబాబు” అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు ధ్వంసం చేశారు. ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై హత్యాయత్నం చేశారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ ప్రభుత్వం నడుస్తోంది అని మరోసారి రుజువైంది. తెలుగుదేశం పార్టీని, కూటమి నాయకులకు హెచ్చరిస్తున్నాం మా ప్రభుత్వం రాగానే, కర్మ తిరిగి వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ రుచిచూపిస్తాం.

-గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి…

ఈ ఘటనపై మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని, ఇది మరోసారి రుజువైందని అన్నారు. “మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసి, ఇల్లు ధ్వంసం చేశారు. ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై హత్యాయత్నం చేశారు. మా ప్రభుత్వం రాగానే, కర్మ తిరిగి వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ రుచిచూపిస్తాం” అని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. …