అమెరికా నుంచి ఇండియాకు మరో 2 విమానాలు
అక్రమమార్గాల్లో అమెరికా వెళ్లిన భారతీయులను తీసుకుని 2 విమానాలు వెనక్కి తిరిగి రానున్నాయి.
ఈ నెల 15న 2వ విమానం, 16న 3వ విమానం ఇండియాకు చేరుకోనుంది. ఇప్పటికే మొదటి విమానం అమృత్సర్ చేరుకుంది. మొదటి విమానంలో 104 మంది భారతీయులుండగా.. రానున్న రెండు విమానాల్లో దాదాపు 200మంది భారతీయులు ఉండనున్నట్లు తెలుస్తోంది…..
ఈ నెల 5న 104 మందిని అమెరికా వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ(Ministry of Foreign Affairs) స్పందిస్తూ.. అమెరికా బహిష్కరణ తుది జాబితాలో మరో 487 మంది భారతీయులున్నట్లు తమ వద్ద సమాచారముందని తెలిపింది.