మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవ్ రావు హతం..ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టుల మృతి …. ప్రకటించిన అమిత్‌ షా…

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఎన్‌కౌంటర్‌లో నంబాల కేశవరావు మృతి చెందాడంటూ అమిత్‌ షా ట్వీట్ చేశారు. మావోలపై మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి స్థాయి నేత చనిపోవడం ఇదే ప్రథమమన్నారు. ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టుల మృతి చెందారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ట్విట్టర్‌లో తెలియజేశారు. నక్సలిజం నిర్మూలనలో కీలక విజయం: అమిత్ షా నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం. ఈరోజు, ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో మన భద్రతా దళాలు 27 మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుబెట్టాయి. సీపీఐ – మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నాయకుడు నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు ఉన్నారు..