వెహికల్ తో స్కూటీ ని ఢీ కొట్టి, బంగారం ఎత్తుకెళ్లిన చైన్ స్నాచర్స్..!

నల్గొండ జిల్లా:

కట్టంగూరు మండలం చెరువు అన్నారం స్టేజి వద్ద జాతీయ రహదారిపై దారుణం.. ప్రైవేట్ స్కూల్ టీచర్‌పై చైన్ స్నాచింగ్ కలకలం.

నకిరేకల్ నుంచి స్వగ్రామం ఐటిపాములకు కొడుకుతో కలిసి స్కూటీపై వెళ్తుండగా.. హెల్మెట్ ధరించిన ముగ్గురు దుండగులు బైక్‌తో ఢీకొట్టి కిందపడేశారు.

బాధితురాలి చేతులను కట్టర్‌తో గాయపరిచి మెడలో ఉన్న 3 తులాల బంగారు పుస్తెలతాడును కత్తిరించుకోని దుండగులు హైదరాబాద్ వైపు పరారయ్యారు..

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు…

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..

ఐదు గంటలకు స్కూల్ అయిపోగానే స్కూటీ పై వెళ్తుండగా వైకిల్ పై వచ్చి స్కూటీ ని డీ కొట్టి ముగ్గురు హెలిమెంట్ పెట్టుకొని వచ్చి మెడలో ఉన్న మూడు తులల బంగారం కాట్ చేసుకొని వెళ్లినట్లు తెలిపారు.. ముగ్గురు కూడా కామన్ మ్యాన్ లో ఉన్నట్టే ఉన్నారని ఇటువంటి మంకీ క్యాపులు వాడలేదని తెలిపారు… బంగారం దొంగిలించి హైదరాబాద్ హైవేపై వెళ్లినట్లుగా తెలిపారు.. ప్రస్తుతం బీభత్సంగా దొంగతనాలు పెరిగిపోవడంతో భయభ్రాంతులకు ప్రజలంతా గురవుతున్నారు..