యూట్యూబర్ అన్వేష్(నా అన్వేషణ)పై కేసు నమోదు..!

యూట్యూబర్ అన్వేష్(నా అన్వేషణ)పై కేసు నమోదు..

శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ దేవతలను, మహిళలను అన్వేష్ కించపరిచేలా మాట్లాడాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన దానవాయిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి..

దీంతో అన్వేష్‌పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు..

ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో సీతాదేవి, ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటూ దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే అన్వేష్ ఇటీవల నటుడు శివాజీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు చేయగా అన్వేష్ ఆయనను ఖండించాడు. అమ్మాయిలు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటారు నువ్వు ఎవరు అంటూ ప్రశ్నించాడు..అంతే కాకుండా ప్రవచనకర్త గరికపాటిపై సైతం ఫైర్ అయ్యారు. అయితే ఈ క్రమంలో అన్వేష్ విచక్షణ కోల్పోయి వారిని బూతులు తిట్టాడు. దీంతో అతడిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి చెప్పాలనుకుంటే పద్ధతిగా మాట్లాడుతూ కూడా చెప్పవచ్చని కానీ పచ్చిబూతులు మాట్లాడటం ఏంటని మండిపడుతున్నారు. అంతే కాకుండా గతంలో అన్వేష్ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అతడిని చాలా మంది అన్ ఫాలో చేశారు. అయినప్పటికీ మరోసారి శాపనార్థాలు పెడుతూ మరో వీడియోను విడుదల చేశాడు. ఈ క్రమంలో అన్వేష్ పై అంతటా అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది…

strong>గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959