ఏపీలో టెన్త్‌ పరీక్షల తేదీలు ఖరారు…

ఏపీలో టెన్త్‌ పరీక్షల తేదీలు ఖరారు.

ఏపీలో పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది.

ఏపీ విద్యార్థులకు అలర్ట్.. ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ప్రతి రోజూ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పరీక్ష ప్రారంభం కానుంది. వంద మార్కుల పరీక్ష అయితే 12 గంటల 30 నిమిషాల వరకూ.. 50 మార్కుల పరీక్ష అయితే 11 గంటల 30 నిమిషాల వరకూ పరీక్ష నిర్వహించనున్నారు. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు..

మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి.

16న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 18న సెకెండ్‌ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్‌, 23న గణితం, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘికశాస్త్రం, 31న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (పేపర్‌-2), ఏప్రిల్‌ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకెండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు..

మరోవైపు మార్చి 31న కాంపోజిట్ కోర్సులకు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (పేపర్‌-2) పరీక్ష ఉంటుంది. అలాగే ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1 పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఏప్రిల్‌ 1న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఎస్ఎస్‌సీ ఒకేషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు ఏప్రిల్ ఒకటో తేదీన థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక వంద మార్కులకు నిర్వహించే పరీక్షలను ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకూ నిర్వహిస్తారు. 50 మార్కులకు నిర్వహించే పరీక్షలు (సైన్స్, సోషల్) ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి11 గంటల 30 నిమిషాల వరకూ నిర్వహిస్తారు. ఈ మేరకు ఎస్ఎస్‌సీ బోర్డు ప్రకటన విడుదల చేసింది.