నేటి ప్రధాన ముచ్చట్లు…

దుబాయ్‌ ఎయిర్‌ షోలో ప్రమాదం.

* కుప్పకూలిన భారత్‌కు చెందిన తేజస్‌ యుద్ధ విమానం

* విమానం కూలిన వెంటనే భారీగా మంటలు, పొగ
* ఇంకా లభించని పైలట్‌ ఆచూకీ

* పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్‌ విమానం

* బెంగళూరులోని HAL సంస్థలో తయారైన విమానం

* మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ప్రమాదం..

*స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి*

నిన్న కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు నోటీసులు ఇచ్చిన స్పీకర్

23వ తేదీ లోపు ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసులు

వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని కోరిన కడియం శ్రీహరి

ఢిల్లీ నుండి రాగానే స్పీకర్‌ను కలవనున్న దానం నాగేందర్

దానం నాగేందర్ మరింత సమయం కోరతాడా లేదా రాజీనామా చేస్తాడా అనే అంశంపై సందిగ్ధత..

తెలంగాణలో 32 మంది ఐపీఎస్ల బదిలీ

తెలంగాణలో భారీగా ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 32 మంది ఐపీఎస్లను బదిలీ చేసింది. నార్కొటిక్ ఎస్పీగా పద్మ, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ ఖార్గే, టాస్క్ ఫోర్స్ డీసీపీగా వైభవ్ గైక్వాడ్, సీఐడీ డీజీగా పరిమళ నూతన్, పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా ఎం. చేతన నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు…

కర్ణాటకలోని 140 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నా ఎమ్మెల్యేలే..కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్..

అందరిని ఒక గ్రూపుగా ఏర్పాటు చేయడం నా రక్తంలో లేదు

సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పూర్తిగా పాలిస్తారు.. మేము ఆయనతో కలిసి పనిచేస్తాం

నేను మరియు సిద్దరామయ్య ఇద్దరం హైకమాండ్‌కు కట్టుబడి ఉంటాము – కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్..

నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా.. బీఆర్ఎస్ పార్టీ వాదననే వినిపిస్తున్నా..పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

కేటీఆర్ గద్వాలకు వచ్చినప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేక రాలేకపోయాను

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు బాగా చేసింది.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు బానే చేస్తుంది

ప్రజలు ఏం నిర్ణయిస్తే నేను దానికి కట్టుబడి ఉంటా అన్నారు..

తెలంగాణలో వివిధ పథకాలకు రూ.480 కోట్లు విడుదల..

సన్న ధాన్యం బోనస్, ఎల్బీజీ మహాలక్ష్మితో పాటు..

మైనార్టీశాఖలకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
సన్నధాన్యం బోనస్‌కు రూ.200 కోట్లు..

ఎల్పీజీ పథకానికి రూ.60 కోట్లు విడుదల
మైనార్టీశాఖకు రూ.220 కోట్లు విడుదల..

సీఎం చంద్రబాబుకు 9 పేజీల లేఖరాసిన జగన్‌..

సీఎం చంద్రబాబుకు 9 పేజీల లేఖరాసిన జగన్‌
కృష్ణా జలాల పరిరక్షణలో ఏపీ ప్రభుత్వ విఫలం
KWDT-2 ట్రిబ్యునల్‌లో ఏపీ ప్రయోజనాలపై వాదించాలి..

తెలంగాణకు 763 TMCలు కేటాయిస్తే APకు తీవ్ర అన్యాయం..

సీమ ప్రాజెక్టులపై TDP నిర్లక్ష్యం చూపుతోంది.

చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఆల్మట్టి ఎత్తు పెంపు
టీడీపీ ప్రభుత్వం AP హక్కులను తెలంగాణకు వదిలేసింది.

బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 TMCలో..
ఒక్క TMC తగ్గినా APకి అన్యాయం.

ఏపీ రైతుల ప్రయోజనాలు కాపాడటం చంద్రబాబు బాధ్యత..

యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదిక‌గా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జ‌ట్లు తొలి టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట‌లో బౌల‌ర్ల హ‌వా కొన‌సాగించింది. ఒక‌టి కాదు నాలుగు కాదు ఏకంగా 19 వికెట్లు తొలి రోజే నేల‌కూలాయి. గ‌త 100 ఏళ్ల యాషెస్ సిరీస్ చ‌రిత్ర‌లో తొలి రోజే 19 వికెట్లు ప‌డ‌డం ఇదే తొలిసారి. 2001లో ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్టులో, 2005లో లార్డ్స్ టెస్టు మ్యాచ్‌ల్లో తొలి రోజు 17 వికెట్లు ప‌డ్డాయి…యాషెస్‌ టెస్ట్‌ తొలి రోజు 18 అంతకంటే ఎక్కువ వికెట్లు పడిన సంద‌ర్భం 1909 సంవ‌త్స‌రంలో చోటు చేసుకుంది. ఓల్డ్‌ ట్రాఫర్డ్ వేదిక‌గా జ‌రిగిన నాటి టెస్టు మ్యాచ్‌లో తొలి రోజే రికార్డు స్థాయిలో 20 ప‌డ్డాయి. అప్పుడు తొలుత ఆస్ట్రేలియా 147 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ 119 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది..

స్మృతి మంధానకు ప్రియుడు పలాస్‌ ‘సర్ప్రైజ్ ప్రపోజల్’.

మహిళల క్రికెట్ టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, ప్రియుడు పలాస్‌ ముచ్చల్‌‌తో ఈనెల 23న పెళ్లి చేసుకోనున్నారు.

ఈ నేపథ్యంలో, పలాస్‌ స్టేడియంలో స్మృతికి ప్రపోజ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

కళ్లకు గంతలు కట్టి గ్రౌండ్‌లోకి తీసుకెళ్లి మోకాళ్లపై కూర్చొని ఆమెకు ప్రపోజ్ చేశారు.

స్మృతి ప్రపోజ్‌ను అంగీకరించి, పలాశ్ను గట్టిగా హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యారు…