స్థానిక ఎన్నికలపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ స్పందన.
స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాలపై క్లారిటీ రాలేదు
మూడు రోజుల్లో కూటమి పార్టీలు కూర్చుని చర్చిస్తాం.
రేపు స్థానిక ఎన్నికల పోటీ విధివిధానాలపై చర్చ
100 శాతం స్ట్రైక్ రేట్ కోసం ప్రయత్నిస్తాం-మాధవ్..
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఈరోజు (మంగళవారం) బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. దేశంలో గొప్ప ప్రభుత్వం నడుస్తోందని పేర్కొన్నారు…ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రతి గ్రామానికి వికాసం వచ్చిందని మాధవ్ తెలిపారు. ప్రతి ఊరులో బీజేపీ జెండా ఎగరాలని సూచించారు. ప్రతి గ్రామంలో వార్డు సభ్యుడు ఉండాలని సూచించారు. చైర్మన్లు, అన్ని పదవుల్లో మనం ఉండాలని తెలిపారు. పదవుల్లో ఉన్నవారంతా మళ్లీ ఓ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మన్ కి బాత్ను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు చేశారని ప్రస్తావించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకున్నామని తెలిపారు.