రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. CRDA, ADCL ఇంజినీర్లు, వివిధ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి.. రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పనులు, భవన నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. ప్రతి నిర్మాణ సంస్థకు పనుల పూర్తిపై నిర్దిష్ట లక్ష్యాలను విధించారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలం దాదాపు ముగిసిన నేపథ్యంలో నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, కార్మికుల సంఖ్యను మరింత పెంచడంతో పాటు అవసరమైన నిర్మాణ సామగ్రి సరఫరాను పెంచాలని సూచించారు.అనంతరం రాజధానిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్ల పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. నిర్మాణ పనుల ప్రస్తుత స్థితిగతులు, ఇప్పటివరకు సాధించిన పురోగతి, తదుపరి చేపట్టాల్సిన పనులపై ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో చర్చించారు..
అనంతరం పార్టీ నాయకులతో..
గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బీసీల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనంపై సమగ్ర అధ్యయనం చేసిన డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులను ఆమోదించింది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఎస్జీఎస్డబ్ల్యూ డేటా ఆధారంగా బీసీ జనాభాను అంచనా వేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది..
నవంబర్ 15లోగా ఎన్నికలు పూర్తి..!
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక భేటీ అయ్యారు. మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. నవంబర్ 15వ తేదీలోగా మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో కూటమి పార్టీలు సమన్వయంతో పనిచేయాలని, 100 శాతం స్థానాల్లో విజయం సాధించే దిశగా కృషి చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. గెలుపు బాధ్యతను జిల్లా ఇన్చార్జి మంత్రులకు అప్పగిస్తూ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికలను అత్యంత సీరియస్గా తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది.
బీసీ రిజర్వేషన్లపై ఉత్తర్వులు, ఎన్నికల గడువుపై ప్రభుత్వ లక్ష్యం నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎన్నికల ఏర్పాట్లు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. అయితే, ఎన్నికల అధికారిక షెడ్యూల్, స్థానాల వారీగా రిజర్వేషన్ల వివరాలు వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది.