ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా
రాష్ట్ర ప్రజలపై దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలి
ఏపీ అన్ని రంగాల్లో విజయం సాధించాలి-చంద్రబాబు
రాష్ట్ర ప్రజలందరికీ సీఎం చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ మనకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుందని దసరా సందేశంలో పేర్కొన్నారు. రైతన్న శ్రమకు తగిన ఫలితం, మహిళలకు సాధికారత, యువతకు మంచి భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న సంకల్పానికి ఆ జగన్మాత అనుగ్రహం లభించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.కనకదుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ, అభివృద్ధిపథంలో ముందుకు సాగాలని.. ప్రతి కుటుంబం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.