జగతి పబ్లికేషన్స్‌ కేసు విచారణ 19కి వాయిదా..

హైదరాబాద్‌: జగన్‌ అక్రమ ఆస్తుల అంశంపై నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్‌ ఛార్జిషీట్‌లో అభియోగాల నమోదుపై సీబీఐ వాదనలు వినిపించింది. దీంతోపాటు, రాంకీ, వాన్‌పిక్‌ అభియోగ పత్రాల విచారణను ధర్మాసనం ఈ నెల 19కి వాయిదా వేసింది. భారతీ సిమెంట్స్ ఛార్జిషీట్‌లో అభియోగాల నమోదుపై విచారణను ఈనెల 20కి, పెన్నా ఛార్జిషీట్‌లో అభియోగాల నమోదుపై విచారణను 22కి వాయిదా

వేసింది. పెన్నా, భారతీ సిమెంట్స్ కేసుల్లో జగన్, విజయసాయిరెడ్డి వాదనలను చివరగా వింటామని, అంతకంటే ముందు మిగతా నిందితులు వాదనలు వినిపించాలని ఆదేశించింది.