ఉత్తరప్రదేశ్ :
యూపీలోని SGPGIMS వైద్యులు మూత్రాశయ సమస్యతో బాధపడుతున్న 60 ఏళ్ల రోగికి అత్యంత అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీతో మూత్రాశయంలోని కణితిని తొలగించారు. ఈ తరహా సర్జరీ ప్రపంచంలోనే మొదటిదని వైద్యులు వెల్లడించారు. మూత్ర విసర్జన సమయంలో అధిక రక్తపోటు, తలనొప్పి వంటి విలక్షణ లక్షణాలతో బాధపడుతున్న రోగికి, ప్రాణాపాయం లేకుండా ఈ చికిత్స ద్వారా పునర్జన్మ ప్రసాదించారు.