ఆడపిల్లల జోలికి వెళ్లినా, నేరాలు చేసినా నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం :సీఎం చంద్రబాబు.

ఆడపిల్లల జోలికి వెళ్లినా, నేరాలు చేసినా నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం : సీఎం చంద్రబాబు

ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి

వీటిపై ప్రభుత్వం యుద్దం చేస్తుంది….గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ” ఈగల్ ” ను ఏర్పాటు చేశాం అన్నారు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. గంజాయి సహా మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఆయన చెప్పారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా ఇతర నేరాలకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా (Nellore district) కందుకూరు మండలం దూబగుంట (Doobagunta)లో ‘‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’’ (Swachh Andhra – Swachh Divas) కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మెటీరియల్‌ రికవరీ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛాంధ్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు..