ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించకుంటే 3 ఏళ్ల అనర్హత వేటు – డిసెంబర్ 18 చివరి తేదీ.!.

ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించకుంటే 3 ఏళ్ల అనర్హత వేటు – డిసెంబర్ 18 చివరి తేదీ!.

ఏపీ ఎన్నికల కమిషనర్ (SEC) పునేఠా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 99 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ తమ ఎన్నికల ఖర్చుల వివరాలను డిసెంబర్ 18లోగా తప్పనిసరిగా సమర్పించాలని ఆయన సూచించారు. గడువులోగా వివరాలు అందించని అభ్యర్థులపై మూడేళ్లపాటు అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. గెలిచిన అభ్యర్థులు వివరాలు సమర్పించకుంటే తమ పదవులను కోల్పోవడంతో పాటు, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోతారని స్పష్టం చేశారు.