మరో ప్రైవేట్ బస్సు బోల్తా.!

మరో ప్రైవేట్ బస్సు బోల్తా.

ఏపీ.. ఇవాళ చేవెళ్ల బస్సు ప్రమాదం మరువకముందే మరో ఘటన జరిగింది.*

ఏలూరు (D) లింగపాలెం(M) జూబ్లీనగర్ వద్ద భారతి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.

ఏలూరు నుంచి HYD వెళ్తుండగా ఘటన జరిగింది.

ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను లింగపాలెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు.

స్థానికులు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు.

బస్సులో 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమత్తం ఆస్పత్రికి తరలించారు.లింగపాలెం మండలం జూబ్లీనగర్‌ దగ్గర ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. ఈ బస్సును భారతి ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా గుర్తించారు.

ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డారని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రమాదం సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఏలూరు నుంచి చింతలపూడి మీదుగా హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..