ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు…..

మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. నైరుతి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కర్నూలు, కడప, విశాఖ, ఒంగోలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది.  పలుచోట్ల ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు  నేలకొరిగాయి. దీంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది…!!