కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం పాటలో పాల్గొనే వారికి హరీష్ రావు హెచ్చరిక..
రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. మీకు ఇక్కడ అనుమతులు రావు
బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి ఎంత పెద్ద ఉద్యమమైనా చేసి ఈ భూమిని కాపాడుతాము
రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మకానికి పెట్టాడు
హెచ్‌సీయూ భూములను తాకట్టు పెట్టి బ్రోకర్ ద్వారా అప్పు తెచ్చుకున్నాడు. మొన్న కేసు గెలిచిన 400 ఎకరాల మియాపూర్ భూమిని కూడా అమ్మకానికి పెట్టాడు
రేవంత్ రెడ్డికి పరిపాలన కంటే భూములు అమ్మడంపైనే ఎక్కువ శ్రద్ధ ఉంది..– హరీష్ రావు..….
కాంగ్రెసోళ్లు గోబెల్స్ మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలన ఎల్‌నినో ( El Nino ) కంటే ప్రమాదకరమని ( Congress rule ) అన్నారు. భూములు అమ్ముకుంటూ పోతే బొందలగడ్డకు కూడా భూములు మిగలవని మాట్లాడిన రేవంత్ రెడ్డి నేడు హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ, టీజీఐఐసీ భూములను అమ్ముతూ భూముల అమ్మకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిండని విమర్శించారు.
ప్రజాప్రయోజనాల కోసం వినియోగించాల్సిన మియాపూర్ ట్రక్ పార్క్ భూములను, రియల్ ఎస్టేట్ దందాల కోసం ఎకరాకు రూ.100 కోట్ల చొప్పున రేవంత్ అమ్మకానికి పెట్టిండని విరుచుకుపడ్డారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఈ భూముల వేలంలో ఎవరైనా పాల్గొంటే భవిష్యత్తులో వాటి అనుమతులను తప్పకుండా రద్దు చేస్తామని హెచ్చరించారు….2013లో కూడా ఈ కూకట్పల్లి ట్రక్ పార్క్ భూమిని అమ్మడానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది
ఆరోజు కూడా సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిసి బీఆర్ఎస్ ఈ భూమిని అమ్మకుండా పోరాటం చేసింది
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ భూమిలో పోలీస్ స్టేషన్, నర్సరీ, ఆర్టీఓ కార్యాలయం, ఎమ్మెల్యే కార్యాలయం కోసం భూమి కేటాయించాము
ఈరోజు రేవంత్ రెడ్డి ఈ భూమిని అమ్మి, ఆ ప్రభుత్వ కార్యాలయాలను కూడా అమ్మేస్తానంటున్నాడు హరీష్ రావు ఆరోపించారు..