ఏపీపీఎస్సీ ద్వారా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ..!

ఏపీపీఎస్సీ ద్వారా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ..

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఎస్) పోస్టుల నియామకాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ పరిధిలోకి తెచ్చింది. ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే రాత పరీక్ష ద్వారా ఆ పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఈ నేపథ్యంలో 1963 నాటి ఏపీపీఎస్సీ నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది….

పశుసంవర్ధకశాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్ల(వీఏఎస్‌) పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషనర్‌ నిబంధనలు-1963ను సవరించారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీఏఎ్‌సల నియామకాలను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినందున, ఏపీపీఎస్సీ నిబంధనలకు వెలుపల ఉన్న ఈ పోస్టులను ఏపీపీఎస్సీ పరిధిలోకి తెచ్చేందుకు తాజాగా సవరణ ఉత్తర్వులు జారీచేసింది. ఏపీపీఎస్సీ రాత పరీక్షల ద్వారా వీఏఎస్‌ పోస్టులను భర్తీ చేయనుంది..