పక్షవాతని అధిగమించి….ఆయుర్వేదంతో తిరిగి నడిచా!: అరవింద్‌ స్వామి

తమిళ నటుడు అరవింద్‌ స్వామి నటన పరంగానే కాదు గ్లామరస్‌ పరంగా ఆయనకు సాటిలేరెవ్వరూ. బాంబే, రోజా మూవీలో వేలాది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు అరవింద్‌స్వామి.
1990లలో వచ్చిన బాంబే, రోజా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరో.. రామ్‌చరణ్ ‘ధృవ’లో విలన్‌గా చేసి సర్‌ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న ఈ హీరో రీసెంట్‌గా ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొని తన లైఫ్‌కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నాడు. ఓ యాక్సిడెంట్‌తో పక్షవాతంతో 18 నెలల పాటు మంచానికే పరిమితయ్యానని, ఆయుర్వేదం కారణంగా 3 రోజుల్లోనే తిరిగి నడిచినట్లు చెప్పుకొచ్చాడు..

అలాంటి ఆయన కెరీర్‌పీక్‌లో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ఇటీవలే ‍ప్రధాన పాత్రలతో ప్రేక్షకులకు చేరవవుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఇన్నాళ్లు తాను ఎందుకు సినీ ఫీల్డ్‌కి ఎందుకు దూరంగా ఉన్నారో వెల్లడించారు. అనారోగ్యం బారిన పడటం ఒక కారణమైతే, అధిక బరువు మరో కారణమంటూ..తాను ఎదుర్కొన్య ఆరోగ్య సమస్య గురించి కూడా వివరించారు. ఇంతకీ ఆయన ఏ అనారోగ్య సమస్యతో బాధపడ్డారంటే..

అరవింద్‌ స్వామికి 2005లో పాక్షికంగా పక్షవాతం వచ్చింది. 18 నెలలు ఎంతగానో నొప్పితో విలవిలలాడాడు. చివరికి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన అది వద్దనుకుని కేరళకు చెందని ఆయుర్వేద వైద్యుడిని ఆశ్రయించినట్లు తెలిపారు. ఒకటిన్నర ఏడాదిగా అనుభవించిన బాధ అంత ఇంత కాదని, ఆఖరికి స్పర్శను కూడా కోల్పోయానని అన్నారు. కానీ ఆయుర్వేదం తనను మూడు రోజుల్లో తిరిగి నడిచేలా చేసిందన్నారు.

అది నాకు చాలా అద్భుతంగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఆయన తనకు పనిచేసింది కాబట్టి ప్రజలను ఫాలో అవ్వమని సూచించడం లేదు. అలాగే గుడ్డిగా కూడా ఫాలో కావొద్దన్నారు. వైద్యుల సూచనల మేరకు, ఆరోగ్య పరిస్థితి రీత్యా సరైన నిర్ణయం తీసుకోండని అన్నారు. ఇక్క నొప్పి, కదలలేని పరిస్థితి కంటే..మానసికంగా స్థైర్యంగా ఉండటం అత్యంత ప్రధానమని అన్నారు. ఆ పరిస్థితిలో నాకే ఇలా అనే ఆలోచన దరిదాపుల్లోకి కూడా వెళ్లకూడదన్నారు. ఆ సమస్య నుంచి బయటపడ్డ వెంటనే..ఫజిల్స్‌, చదరంగం వంటి ఆటలతో బిజీ అయిపోయినట్లు తెలిపారు.

అయితే ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డాక మళ్లీ సినీ రంగంవైపుకి రావాలని అస్సలు అనుకోలేదు, సినిమా చేయాలని కూడా అనుకోలేదట. ఎందుకంటే ఆ టైంలో చాలా మందులు వాడటంతో విపరీతం బరువు పెరిగిపోయి, జుట్టు ఊడిపోయి అదోలా తయారయ్యానని, దాంతో సినిమాల ఆలోచన రాలేదని చెప్పుకొచ్చారు అరవింద్‌ స్వామి. ఎంత టెక్నాలజీ అభివృద్ది చెంది..ఆధునాత వైద్యం చెంతకు చేరినా..ఏళ్లనాటి పురాతన ఆయుర్వేదమే అత్యుతమమని పలు ఉదంతాల్లో నిరూపితమైంది కూడా.