రేపటి నుంచి ATM ఛార్జీల పెంపు..!

*రేపటి నుంచి ATM ఛార్జీల పెంపు*

RBI ఆమోదం మేరకు రేపటి నుంచి ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు పెరగనున్నాయి. నెలవారీగా ఉచిత పరిమితి దాటితే ప్రతి లావాదేవీపై రూ. 21 కాకుండా ఇప్పుడు రూ.23 ఛార్జ్ పడనుంది. అలాగే, బ్యాలెన్స్ చెకింగ్కు సైతం ఛార్జ్ ఇంతకుముందు రూ.6 ఉండగా.. దానిని రూ.7కు పెరగనున్నాయి. యూజర్లు తమ బ్యాంకు ఏటీఎంలో ఐదుసార్లు, ఇతర బ్యాంకుల్లో మూడు సార్లు ఉచితంగా లావాదేవీలు చేసుకోవచ్చు..