ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు..
తెలంగాణలో ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందించనున్నట్లు ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క ప్రకటించారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణిస్తే వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.ఈ పథకం కింద నిజమైన లబ్ధిదారులకు మాత్రమే న్యాయం జరగాలనే ఉద్దేశంతో అధికారులకు మంత్రి సీతక్క కఠిన ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి వివరాలను అధికారులు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. అర్హుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యం గానీ, తప్పులు గానీ జరగకూడదని, అర్హత ఉన్న ప్రతి ఒక్క ఒంటరి మహిళకు తప్పనిసరిగా పెన్షన్ అందేలా చూడాలని అధికారులను అలర్ట్ చేశారు..