ఎన్టీఆర్ జిల్లా:
మైలవరం.. రాయనపాడు
విజయవాడ రైల్వే రద్దీకి ప్రత్యామ్నాయంగా రాయనపాడు స్టేషన్ ప్రారంభం…
అమృత్ భారత్ పథకంలో రూ.35 కోట్లతో ఆధునికీకరణ.
వర్చువల్ ప్రారంభించిన ప్రధాని మోడీ……
ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని,ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు….
విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్‌పై రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి శాశ్వత ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది…..
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.35 కోట్లకు పైగా వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఈ స్టేషన్‌ను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
అనంతరం వారు స్టేషన్లో ఏర్పాటు చేసిన ఆధునిక సౌకర్యాలను పరిశీలించి, రాయనపాడు స్టేషన్ అభివృద్ధి విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు……….
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు మాట్లాడుతూ, ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని విశాలమైన ప్లాట్‌ఫారాలు, ఎయిర్ కండీషన్డ్ వెయిటింగ్ హాల్, లిఫ్టులు, ఆధునిక టికెట్ కౌంటర్లు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, విశాల పార్కింగ్ స్థలం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, కొండపల్లి కళారూపాలను ప్రతిబింబించే ఆకర్షణీయమైన ముఖద్వారం వంటి వసతులను ఏర్పాటు చేశామని తెలిపారు……
భవిష్యత్తులో మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా ఇక్కడ హాల్ట్ కల్పించే అవకాశముందని, విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించడంతో పాటు రాయనపాడు స్టేషన్‌ను శాటిలైట్ టెర్మినల్‌గా, కీలక రైల్వే హబ్‌గా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు…….
ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి నూతులపాటి బాల కోటేశ్వరరావు (బాల), కూటమి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు మరియు స్థానికులు పాల్గొన్నారు.