టీమిండియా(Team India)తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT)లో ఆస్ట్రేలియా (Australia) 3-1 తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఐదో, చివరి టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG) వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ మూడో రోజు 162 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ఆ క్రమంలో 27 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆస్ట్రేలియా సులువుగా విజయం సాధించింది. 1978లో సిడ్నీలో భారత్‌కు ఏకైక టెస్టు విజయం. అయితే ఈసారి సిడ్నీ టెస్ట్‌లో టీమిండియా ఎందుకు వఓడిపోయింది, అనే దానిపై తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నారు..
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆదివారం ముగిసిన ఐదో టెస్ట్‌లో 6 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ పరాజయంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసీస్ 3-1తో కైవసం చేసుకుంది. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ సిరీస్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ (డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ చేరింది….162 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 27 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఉస్మాన్ ఖవాజా(45 బంతుల్లో 4 ఫోర్లతో 41)రాణించగా.. ట్రావిస్ హెడ్(38 బంతుల్లో 4 ఫోర్లతో 34 నాటౌట్), బ్యూ వెబ్‌స్టర్(34 బంతుల్లో 6 ఫోర్లతో 39) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు..
కొంపముంచిన బుమ్రా గాయం..
భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(3/65) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/69) ఒక్క వికెట్ పడగొట్టాడు. గాయంతో బుమ్రా బౌలింగ్ చేయకపోవడం ఆసీస్‌కు కలిసొచ్చింది..
నిరాశపర్చిన జడేజా, సుందర్…
ఎన్నో అంచనాలతో మూడో రోజు ఆట ప్రారంభించిన రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తీవ్రంగా నిరాశపరిచారు. ఓవర్‌నైట్ స్కోర్‌కు 6 పరుగులు మాత్రమే జోడించారు. ఈ ఇద్దర్నీ కమిన్స్ పెవిలియన్ చేర్చాడు. జడేజా(13)ను క్యాచ్ ఔట్ చేసిన కమిన్స్.. సుందర్(12)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మహమ్మద్ సిరాజ్(4), జస్ప్రిత్ బుమ్రా(0)లను ఒకే ఓవర్లో బోలాండ్ ఔట్ చేయడంతో భారత రెండో ఇన్నింగ్స్‌కు తెరపడింది…
అందుకే ఓడిపోయాం..
పరాజయం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్‌ను బుమ్రా గైర్హాజరే ఆఖరి టెస్ట్‌లో టీమిండియా ఓటమికి కారణమా? అని ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చాడు.
‘జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం వల్లే మేం ఓడిపోయామని నేను చెప్పను. మాకు గెలిచే అవకాశాలు లభించాయి. అయినా మేం విజయాన్నందుకోలేకపోయాం. సమష్టి వైఫల్యంతోనే సిరీస్‌ను కోల్పోయాం. జట్టు ఎప్పుడూ ఒక్క ఆటగాడిపై ఆధారపడకూడదు.’అని గంభీర్ బదులిచ్చాడు…
రిషబ్ పంత్ ఒక్కడిగానే..
రిషబ్ పంత్ ఒక్కడిగానే వచ్చాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఆడిన ఆటకు ఏ సినిమా మ్యాచ్ అవుతుందో తెలియదు.. ఏ డైరెక్టర్ దాన్ని గొప్పగా తీయగలడో నేను చెప్పలేను. వేల గనుక ఆ సినిమా తీయగలిగితే గుండెను గుప్పెట్లో పట్టుకొని ఆ సినిమాను జనం అంతసేపు చూస్తారు.. అందులో అనుమానం లేదు.. కావాలంటే చూడండి స్టార్క్ మీద పంత్ రివెంజ్ తీర్చుకున్న విధానం న భూతో న భవిష్యతి . తన బాడిని టార్గెట్ చేసి విసిరిన బంతులకు సరైన సమాధానం చెప్పాడు.. క్రికెట్ పిచ్చి ఉన్న వాళ్ళందరికీ తన ఇన్నింగ్స్ తో సమ్మోహితులను చేశాడు. మాదకద్రవ్యాలు కూడా ఇవ్వలేనంత కిక్ ఎక్కించాడు. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్లను ఉతికి ఆరేశాడు.. ఒక రకంగా చెప్పాలంటే తడిపేసాడు.. తను క్రీజ్ లో ఉంటే గజ్జలు వణికి పోతాయని నిరూపించాడు. వికెట్లు పడగొట్టిన బోలాండ్.. బౌలింగ్ లో స్ట్రైట్ సిక్స్ కొట్టాడు.. అది మ్యాచ్ కే హైలెట్.. అందువల్లే కమిన్స్ అప్రమత్తమయ్యాడు.. ఏకంగా బౌండరీ లైన్ వద్ద ఆరుగురిని మోహరింపజేశాడు. అయినప్పటికీ పంత్ తన ఊపుడు. ఆపితే కదా.. వాస్తవానికి ఫస్ట్ ఇన్నింగ్స్ లో అతడికి తగిలిన బంతులను.. ఇంకొక బ్యాటర్ కనుక ఎదుర్కొని ఉంటే.. పరిస్థితి మరో విధంగా ఉండేది. కనీసం అతడు మ్యాచ్ ఆడే వాడు కూడా కాదు..
అందువల్లే ఈ కసి
పంత్ దూకుడుగా ఆడటం వెనుక చాలా కారణాలు ఉండి ఉండవచ్చు. తనను కావాలని కొట్టారని బాధతో పంత్ ఎదురుదాడికి దిగి ఉండవచ్చు. ఏది ఏమైతేనేం.. ఉన్నంతసేపు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు..వెబ్ స్ట ర్ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్ చరిత్రలో నిలిచిపోయింది. స్టార్క్ బౌలింగ్ లో కొట్టిన సిక్సర్లు అభిమానులకు వీనుల విందుగా నిలిచిపోయాయి. దీంతో స్టార్క్ మళ్ళీ బౌలింగ్ వేయలేదు. తన ఎడమ చేతివాటంతో వంగి వంగి బ్యాటింగ్ చేస్తుంటే.. మ్యాచ్ రిజల్ట్ పక్కన పెడితే.. పంత్ ఇలా మాత్రమే ఆడాలి అని కోరుకోని సగటు టీమిండియా అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. అతడు ఎవరినీ లెక్కచేయడు.. స్టార్క్ నా, బోలాండా.. ఎవడైనా సరే ట్రీట్మెంట్ ఒకే లాగా ఇచ్చేశాడు.. డిఫెన్స్ ఆడమని కొంతమంది కామెంట్రీ బాక్సులో వాగుతుంటారు.. ఇంకొంతమంది డ్రెస్సింగ్ రూమ్ లో బుర్ర తిని ఉంటారు.. కానీ అతడు అలానే ఉంటాడు. టెస్ట్ క్రికెట్లో తుఫాన్ అనే పదానికి నిర్వచనం లాగా ఉంటాడు.. పంత్ కొత్తగా నిరూపించుకోవడానికి ఏమీ లేదు. కొత్తగా సెట్ చేయడానికి కూడా ఏమి లేదు.. అది ఉపఖండం మైదానాలయినప్పటికీ.. ఇతర మైదానాలయినప్పటికీ.. బ్యాటింగ్ అలానే ఉంటుంది..
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న భారత్..
జూన్ 11న లార్డ్స్‌లో ప్రారంభమయ్యే WTC ఫైనల్లో పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని జట్టు ఇప్పటికే అర్హత సాధించిన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ నెలాఖరులో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంకకు వెళ్లాల్సి ఉంది.
న్యూజిలాండ్‌తో 3-0తో ఓడిపోయిన తర్వాత సిరీస్‌లోకి వచ్చిన భారత్, ఆస్ట్రేలియాను ఓడించడం లేదా కనీసం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ని డ్రా చేసుకోవడం అవసరం. కానీ, సిరీస్‌ను 3-1 తేడాతో కోల్పోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి అధికారికంగా తప్పుకుంది. అలాగే, రోహిత్ కోహ్లీలు కూడా తమ చివరి ఆస్ట్రేలియా సిరీస్ ఆడినట్లేనని తెలుస్తోంది…