ఆహ్లాదకర వాతావరణం, ప్రకృతితో మమేకం చేస్తూ హైదరాబాద్ బల్కంపేటలో చికిత్స*
* *థెరపిస్టులు, హౌస్సర్జన్లు, యోగా నిపుణులతో ప్రకృతి వైద్యం*
* *తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెల్లరేషన్ కార్డు ఉంటే రాయితీ సదుపాయం*
రోజు రోజుకూ పెరుగుతున్న వాతారణ కాలుష్యం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాటితో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు కూడా ప్రకృతికి దూరమవుతున్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని సువిశాల ప్రాంగణం, ఆహ్లాదకర వాతావరణం, ప్రకృతితో మమేకం చేస్తూ హైదరాబాద్ నగరంలో చికిత్స అందిస్తున్నారు. యోగా సాధన, పౌష్టికాహారం వంటి సదుపాయాలన్నింటినీ బల్కంపేటలోని కొణిజేటి రోశయ్య ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయం అందజేస్తోంది. ఏదైనా అనారోగ్య సమస్యలతో అక్కడికి వెళితే పూర్తి ఆరోగ్యంతో బయటకు వచ్చేస్తారు. ఇక్కడంతా ప్రకృతికి సంబంధించిన వైద్యమే ఉంటుంది.
*ఈ రోగాలకు వైద్యం అందిస్తారు :*
* మధుమేహం, చర్మవ్యాధులు, జీర్ణకోశ, మానసిక ఒత్తిడి, మలబద్దకం, థైరాయిడ్, స్థూలకాయం, మెడ, నడుము, కీళ్ల నొప్పులు, కీళ్లవాతం, శ్వాసకోశ వ్యాధులు, నిద్రలేమి వంటి సమస్యలకు వైద్యం అందిస్తారు.
*ప్రత్యేకతలు :*
* గర్భిణులు సాధారణ ప్రసవమయ్యేలా కొన్ని సాధనలు చేయిస్తారు.
* స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తి, గర్భధారణ వంటి సమస్యలకూ చికిత్స అందిస్తారు.
* ఇన్పేషెంట్, ఔట్పేషెంట్ సౌకర్యం ఉంది.
* ఓపెన్ జిమ్, 8 పాత్వే (8 దారులతో కూడిన నడకదారి).
* అత్యాధునిక సదుపాయాలతో ఉన్న భోజనశాల.
* కిచెన్ గార్డెన్, వంటింటి తోట.
* మూలికల వనం.
* థెరిపిస్టులు, హౌస్సర్జన్లు ఉన్నారు.
* నిపుణులతో యోగాసనాలనూ నేర్పిస్తారు.
* అక్కడే ఉండి చికిత్స పొందున్న వారికి వ్యక్తిగత, షేరింగ్ కాటేజీల సదుపాయం ఉంది.
*అందించే చికిత్సలు :*
మట్టి, జల మర్దన, తానాబాత్, డీలక్స హైడ్రో మసాజ్, యోగా, ప్రాణాయామం, ధ్యాన క్రియలు, వాయు చికిత్స్, సూర్యకిరణ చికిత్స, ఆథపత్ (ఆకులను వేడి నీటిలో మరిగించి చేసే స్నానం), షట్కర్మల చికిత్స, ఫిజియోథెరఫీ, ఆక్యూపంచర్. తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెల్లరేషన్ కార్డు ఉంటే రాయితీ ఉంటుంది.
*ప్రాంగణంలో ఉన్న సంస్థలు :*
* ప్రకృతి గంధీ వైద్య కళాశాల.
* వేమన యోగా, ప్రాణాయామం పరిశోధనా సంస్థలు.
*ప్రకృతి వైద్యం :*
ప్రకృతి వైద్యం ఓ సహజ చికిత్స పద్ధతి మాత్రమే కాదు. మన జీవన విధానంలో ఒక భాగం. జీవితాంతం ఆరోగ్యంగా, ఆనందంగా, హాయిగా జీవించటానికి తోడ్పడే సాధనం. జబ్బులను ప్రకృతిలో అంతటా ఉచితంగా లభించే మట్టి, గాలి, నీరు, ఎండ వంటి సహజ వనరులతోనే నయం చేయటం ఈ వైద్యం ప్రత్యేకత. మన శరీరం పంచ భూతాలు (నేల, నీరు, గాలి, కాంతి, ఆకాశం) సమూహం అని పెద్దలంటారు. వీటి సాయంతోనే శరీరంలోని ప్రాణశక్తిని (వైటల్ ఫోర్స్) ఉత్తేజితం చేయటం, జబ్బులను మూలం నుంచి తొలగించటం ప్రకృతి వైద్యం విశిష్టత. ఇది అందరూ ఆచరించటానికి వీలైనదీ, చవకైనది. అప్పటికప్పుడు తలెత్తే ఇన్ఫెక్షన్లు నయం కావటానకి కూడా ఇది వర్తిస్తుంది.
మన రోగనిరోధక శక్తి, శరీర సామర్థ్యం ప్రకృతి మీదే ఆధారపడి ఉంటుంది. మనం తాగే నీరు, తినే ఆహారం, మానసిక స్థితి, శారీరక శ్రమ వంటి వాటి ద్వారా ప్రాణశక్తి శరీరం అంతా విస్తరిస్తుంది. దీని సహాయంతోనే శరీరం తనను తాను కాపాడుకోవడానికి, ఏవైనా జబ్బులు వస్తే నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మందుల ప్రమేయం లేకుండా సహజ వనరులతో ప్రాణశక్తిని ప్రేరేపించి, శరీరం తనకు తానుగా జబ్బులను నయం చేసుకునేలా తోడ్పడుతుంది…