బండి భగీరథ్ కు నోటీసులు..
రేపు మధ్యాహ్నం 02:00 గంటల వరకు హాజరు కావాలని ఆదేశాలు.
ఈ క్రమంలో బండి భగీరథ్ ఫై పెట్టిన POCSO కేసులో పలు సెక్షన్లను సవరించిన పోలీసులు.
బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం BNSS సెక్షన్ 5(1), రెడ్ విత్ 6 సెక్షన్లు అదనంగా జోడించిన పోలీసులు..
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు .. రోజురోజుకూ మరింత ఉత్కంఠగా మారుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్).. కీలక విషయాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే బాధిత కుటుంబాన్ని కలిసి.. వారి నుంచి మరింత సమాచారం సేకరించిన సిట్ అధికారులు.. ఈ కేసులో కీలక విషయాలను తెలుసుకునేందుకు విచారణకు రావాలని బండి భగీరథ్కు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన ఇవాళ సిట్ విచారణకు హాజరు కాకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది…అతడిపై నమోదైన పోక్సో కేసులో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణ కోసం హాజరు కావాలని బండి భగీరథ్ కు సిట్ అధికారులు మంగళవారం రోజున నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బండి భగీరథ్ ఆచూకీ కనిపించడం లేదంటూ.. ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బండి భగీరథ్ సిట్ విచారణకు గైర్హాజరు కావడంతో.. ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది. మరోవైపు.. బండి భగీరథ్ పరారీలో ఉన్నాడంటూ.. ఇవాళ హైదరాబాద్ మొత్తం గోడలపై పోస్టర్లు అతికించిన నేపథ్యంలో.. ఇప్పుడు ఆ కేసులో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు బండి భగీరథ్ ఎక్కడ ఉన్నాడు, అతడిని ఎవరైనా రక్షిస్తున్నారా అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి..