మైదానంలో ఒక ఆటగాడు చూపించిన నిజాయితీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా..

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అంటే సిక్సర్లు, ఫోర్లు, రికార్డుల గురించే మాట్లాడుకుంటాం. కానీ ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన మ్యాచ్ ఒక వెరైటీ ఘటనతో వార్తల్లో నిలిచింది. పరుగుల వేట కంటే కూడా మైదానంలో ఒక ఆటగాడు చూపించిన నిజాయితీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆర్‌సీబీ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు..ఆసక్తికర ఉదంతం బెంగళూరు ఇన్నింగ్స్ సమయంలో జరిగింది. ఆర్‌సీబీ ఓపెనర్ జాకబ్ బెథెల్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో కార్తీక్ త్యాగి వేసిన షార్ట్ పిచ్ బంతిని ఎదుర్కొన్నాడు. ఆ బంతి వేగంగా వచ్చి బెథెల్ చేతికి తగిలి, ఆపై హెల్మెట్‌ను బలంగా తాకింది. ఆ దెబ్బకు తగిలిన షాక్‌లో బెథెల్ మెడలో ఉన్న బంగారు గొలుసు తెగి పిచ్‌పై పడిపోయింది. ఆ కంగారులో బెథెల్ 15 పరుగులకే అవుట్ అయి, తన చైన్ పడిపోయిన విషయం గమనించకుండానే పెవిలియన్‌కు వెళ్ళిపోయాడు…