బంగ్లాదేశ్‌లో మరోసారి ఘర్షణలు.. !.యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు..! కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ.!

యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు..!

కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ.!

బంగ్లాదేశ్‌లో మరోసారి అతలాకుతలమైంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది..రాజధాని ఢాకా సహా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. నిరసనకారులు రోడ్ల మీదకు రావడంతో కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి.

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులో బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసీటీ) నేడు తీర్పు వెలువరించనుంది. గతేడాది విద్యార్థుల నిరసనల అణచివేత కేసులో ఆమె అమానుష చర్యలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. హసీనా, ఆమె ప్రభుత్వంలో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ఖమాల్‌‎ను నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన వ్యక్తులుగా ప్రకటించి విచారణ జరిపారు. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న హసీనాకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు..