బాసర Basara Temple ఆలయంలో భారీ చోరీ
మహంకాళి Mahakali అమ్మవారి వెండి కిరీటం, హుండీ ఎత్తుకెళ్లిన దుండగులు..
నిర్మల్ జిల్లా. Nirmal district. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో పై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి వెండి కిరీటం, హుండీ దొంగలించి, డబ్బులు కాజేసి హుండీ వ్యాసగుడి వద్ద వదిలేసి పారిపోయిన దొంగలు
సీసీటీవీ ఫుటేజ్ cctv ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
తెలంగాణలోనే Telangana అత్యంత ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఘోర భద్రతా వైఫల్యం బయటపడింది. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆలయ ప్రాంగణంలోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు భారీ చోరికి పాల్పడ్డారు. నిరంతరం భద్రతా సిబ్బంది, సీసీటీవీల నిఘా ఉండే ఇంతటి భారీ క్షేత్రంలో దొంగతనం జరగడం స్థానికంగా, భక్తులలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఆలయ ప్రాంగణంలోని పైఅంతస్తులో కొలువై ఉన్న ఉపాలయం.. మహంకాళి అమ్మవారి సన్నిధిని దొంగలు టార్గెట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో మహంకాళి Mahakali ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు, గర్భాలయంలోని అమ్మవారి వెండి కిరీటాన్ని అపహరించారు. దాంతో పాటు అక్కడే ఉన్న కానుకల హుండీని కూడా ఎత్తుకెళ్లారు. అనంతరం హుండీలోని నగదు మొత్తాన్ని కాజేసి, ఖాళీ హుండీని సమీపంలోని వ్యాసగుడి వద్ద పడేసి పరారయ్యారు. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవ, నిత్య పూజల కోసం ఆలయానికి చేరుకున్న అర్చకులు, తలుపులు విరగ్గొట్టి ఉండటం గమనించి వెంటనే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు..