*🔹డిప్యూటీ సీఎం భట్టికి హైకమాండ్ నుంచి పిలుపు*
_• కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్న డిప్యూటీ సీఎం భట్టి_
*• మంత్రుల సమావేశంలో ఉండగా ఫోన్.*
_• శాఖల మార్పుపై ఆరా తీసిన హైకమాండ్._
_• ఇప్పటికే ఢిల్లీ బయల్దేరిన ఉత్తమ్.._
_• కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్న డిప్యూటీ సీఎం భట్టి._
_• రెండు రోజులుగా ఢిల్లీలోనే వున్న సీఎం రేవంత్‌రెడ్డి._
_• మంత్రుల శాఖల్లో మార్పులు చేసే యోచనలో అధిష్ఠానం._
_• కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై.. రాహుల్‌గాంధీ, ఖర్గేను కలవనున్న ఉత్తమ్, భట్టి..
తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. ఐదుగురు అన్న చోట ముగ్గురితో సరిపెట్టారు. సామాజిక సమతుల్యంతో కేబినెట్ పోస్టులు భర్తీ చేశారు. రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావులు అలకబూనినా.. కాంగ్రెస్ పెద్దలు నచ్చజెప్పడంతో కూల్ అయ్యారు. సుదర్శన్‌రెడ్డి మాత్రం ఇంకా ఫైర్ మీదే ఉన్నారు. ఆయన వర్గీయులు రాజీనామాలతో రచ్చ రాజేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలను కలిశారు. కేబినెట్ విస్తరణ, ఆ తర్వాత జరిగిన పరిణామాలను అధిష్టానానికి వివరించారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత మంత్రుల శాఖల మార్పులపై కూడా చర్చిస్తున్నారు. హైకమాండ్ నుంచి మంత్రులు ఉత్తమ్, భట్టిలకు పిలుపు వచ్చింది. వాళ్లు హుటాహుటినా ఢిల్లీ తరలి వెళ్లారు. ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీపైనా చర్చించే ఛాన్స్ ఉందని అంటున్నారు…